పుట:Bhaarata arthashaastramu (1958).pdf/456

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నష్టభాగ మనుష్ఠానములోనున్న శిల్పశాలలో కాలక్రమేణ శిల్పులకు యాజమాన్యమున బ్రవేశముగల్గు సరణి యున్నదనుట స్పష్టము.

3. సంభూయసముత్థానములు:- అనగా నల్పమూల్యములైన చిల్లరభాగముల నేర్పఱచుకొని శ్రమకరు లనేకు లేకీభవించి స్థాపించెడు కంపెనీలు కొన్నిగలవు. అయిన నిందొక్కవిశేషము. కార్యకర్తలుగా నియమింపబడినవారికిని దమకును మనస్తాపములుగలిగి సంఘము శిధిలమగునోయను శంకచే దానియందు భాగస్థులుగానుండు శిల్పులు అందు పనికి గుదరక యితరశాలలలో బ్రవేశించి కూలిసంపా దించి కొందురు. శిల్పులొకేశాలలో నొక విధముగజూచిన సేవకులుగను వేఱొక విధముగజూచిన యజ మానులుగనునుండిన కార్యము పొందికగా జఱుగుట కష్టసాధ్యమని పూర్వమేవివరించితిమి. ఈ యిక్కట్టులు లేకుండుటకై యొకశాలలో భాగములుగొని యింకొక శాలలో నౌకరులుగా శిల్పులు చేరుటయు గలదు. యజమానత్వముండుచోట దాసత్వము, దాసత్వముండుచోట యజమానత్వమును లేనిపద్ధతియిది.

శ్రమకరులు మూలధనం వినియోగించి భాగస్థులై యొడయలై యుండుదురను నొక విషయమునందప్ప తక్కిన విచారములనెల్ల నీ సంఘములు సామాన్యములైన కంపెనీల కరణి నుండునవి. నిర్మాణముం బట్టిచూచిన వీనికి భేద మిసుమంతయుం గానము.

4. కొన్నిసంఘములలో శ్రమకరులు మూలధనము నిక్షేపించి భాగములు గొనువారు కాకపోయినను గార్యతంత్రంబుల యజమాను లట్లు తామును నాలోచనజెప్పి తమ సమ్మతి వెల్లడిపఱచు హక్కు గలవారుగానున్నారు. ఇట్టి సంఘములలో నాయకులకు సేవకులకు నెడతెగని సంయోగము సిద్ధము. మఱియు శక్తికొలది బదవుల నందవచ్చుగాన నెల్లరు మహోత్సాహమున దమతమ పనుల నెరవేర్తురు.