పుట:Bhaarata arthashaastramu (1958).pdf/445

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. భాగస్థులు వంచనకు లోనయినవారగుదురు. లాభమునం దధికభాగము చోదకులకును వారి యంతరంగ మిత్రులకును జేరునుగాని సాంఘికుల కెల్లరకును సమప్రయోజనకారిగాదు.

ఈ క్రియకు భాగములను నీళ్ళువోసి కలుపుట, యని కొందఱు పేరిడిరి. బోలుభాగముల సృష్టించుట యనియుం జెప్పవచ్చును. ద్రవ్య రూపమైన భాగములు స్థాపకులచే దొలుత గూర్పబడిన 10,000 మాత్రమే! తక్కిన 30,000 లును రొక్కమాధారముగా గలిగినవి గావు. మఱి నోటిమాటలచే దీఱినవి. వారు సహాయముచేసిరి, వీరు సహాయముచేసిరి యను మిషచే వారివద్దనుండి ధనము దీసికొనకయే యియ్యబడినవి. ఇది యాద్యంతము శుద్ధవంచనము. విషప్రాయము!

సర్కారువారు దీనికేరీతి బ్రతివిధానము చేయవచ్చును? చెప్పుడు? వ్యాపారముయొక్క గుట్టు తెలిసి యుండినంగాని లాభముయొక్క పెంపుఎంత, కృత్రిమభాగములెన్ని, నిక్కములెన్ని? యని నిర్ణయించుట యసాధ్యము. మఱియు నుత్పత్తి కింత వ్యయము పట్టును, సాధారణలాభము, వడ్డీ, ఈమాత్రము అని తెలియనిది ధరల మితము మీఱి దారుణమున హెచ్చించుచున్నారా, లేదా? యని నిర్ధారణ సేయుటకుంగాదు. ఇట్లీ ట్రస్టుల యంతరంగలనన్నియు బహిరంగములం జేసినగాని దేశము నకును, బ్రజకును, వాని భాగస్థులకును క్షేమ మనిత్యము. పెనుబాముల చందముననుండు నీట్రస్టుల కోఱలు పెఱికివేయవలయునను బ్రతిజ్ఞతో జేయబడియుండు శాసనముల ముఖ్యాంశములెవ్వియన:-

1. గవర్నమెంటుచే నియమింపబడిన సంప్రతులకు ట్రస్టుల యజమానులు తమ లెక్కలన్నియు నొక్కింతయైన దాపక చూపవలయు. మఱుగుజేసిన జుల్మానాలు మొదలగు శిక్షలు దప్పవు.

2. ట్రస్టులచే నుద్ధరింపబడి వ్యాప్తికివచ్చువెలలు, అమితఘోరములని యేర్పడినచో గవర్నమెంటువారు ప్రత్యక్షముగ నైనను,