పుట:Bhaarata arthashaastramu (1958).pdf/441

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దీనికి సంధులుచేసిన ప్రతిక్రియ:- ధర్మకర్తల నేర్పఱచిన దేలయనగా బ్రత్యేకశాలలు పేరైన లేకపోవునే యను మెత్తదనము చేత. మఱియు గొన్నిశాలలవారింబిలిచి మీసంఘము రద్దుచేయుడని యాదేశించినవారు "మీకన్న మేమేమిట దక్కువ" యని తిరుగబడుదు రేమోయను శంకయు నొక కారణము. అయినను నొక్కతూరి సంధులు సృష్టికివచ్చి దానివలని తీపులను భాగస్థులు చవిజూచిన పిమ్మట నట్టి వ్యర్థములైన యభిమానముల నావశ్యకములు గావున "మాకు ధర్మకర్తలు విశ్వాస సత్రములు నివియేవియు నిప్పడు పనికిరావు. రాజ్యాంగమువారు కావలయునన్న నెత్తికొనిపోయి మ్రింగివేయనిండు? మాకేమి తక్కువ? మేము ప్రత్యేకసంఘముల సంధియను బిరుదమువదలి యేకసంఘము గా నేర్పడుదుము. ఇష్టమువచ్చిన జనులందఱు నేకీభవించి భాగము లేర్పఱచుకొని వ్యాపారముం జేయుటలో నేతప్పును లేదుగదా?'

ఇట్లీ శాసనమును మోఘంబుగాజేయ సంఘములు సంధిచేసికొనియుంటమాని యైక్యముంజెంద మొదలిడిన బ్రజకు "గోరుచుట్టుపై రోకలిపోటు" అన్నటులాయె.

2. ధర్మసంధుల నడుపువారు తమకింత యెక్కువ లాభము వచ్చుచున్నదని ప్రజ లెఱింగిరేని, ఈర్ష్యచే వైరమెత్తి నూతనసంఘముల నిర్మింతురనుశంకచే దమలాభమును గుప్తముజేయ నొక యుపాయముం బన్నిరి. అది యేదనగా, చూడుడు! ఏబదియేండ్లప్పు డొకానొకడు టెంకాయతోట నొండు కొనియెనను కొందము. దాని యప్పటివెల 1000 రూపాయలు. అనగా నిచ్చితీసినవెల. కొన్ని ఋతువులకు దానియందలిఫలము 100 రూపాయలు చేయునదియాయె. అప్పుడు బ్యాంకీలో నిక్షేపించినవారికి లభించువడ్డీ 100కి 5 రూపాయలు. అట్టితరుణమున తోటయొక్కవెల యెంతయని ప్రశ్న ఉత్తరము:-