పుట:Bhaarata arthashaastramu (1958).pdf/439

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మునుపటికన్న నెక్కువగ సరకుల నుత్పత్తికిం దెచ్చిరి. అమితస్పర్ధ దుర్వ్యయకారిణియనుట కింతకన్న మించిన తార్కాణమేమికావలయు? వైరము ముదిరిన దినములలో నలువది యంత్రములు నిలిచి నిలిచి చేయుపనిని, ఇరువది యంత్రములలో నిలుకడలేక సాగించిన దీఱగలదు. కావున నిందుచే గలుగుమేలు లెయ్యవియనిన, కాలము వ్యర్థముగాకుండుట, ఉత్పత్తిని దక్కువ వ్యయముతో సాధించుట యనునవి.

2. విక్రయమునకువచ్చు సరకుల మొత్తములో ముక్కాలు పాలు తమకుం జేరినదిగాన వెలలు విధించుటలో వీరుపెట్టినిది భిక్షము. చక్కెర యావశ్యకంబగువస్తువు. సాధారణముగ భోజనాదుల యందఱును దానిని వినియోగింతురు. కావున వెల కొంతహెచ్చినను గిరాకి మిక్కిలి తగ్గదు. అట్లగుట వెలలు హెచ్చించిరి. అనగా బ్రజాపీడనమను వ్రతముం దాల్చిరనుట.

3. చక్కెర వ్యాపారమున ననిరోధ ప్రభుత్వముం గైకొన్నవారగుట వెలలను స్థిరత వహింప జేయను సమర్థులైరి వెలలును నిలుకడగాంచె. అయిన నొక్కటి. ఎప్పుడు చలనము గలిగినను బైకెక్కుటయేగాని క్రిందికిదిగుట లేమిచే వినియోజకుల బ్రతుకుపాటు మేలిమి జెందదాయె.

4. ఇక నాసంధి సంఘములకు నంగభూతులైన వారికెల్లరకును లాభములు మెండయ్యెననుట వేఱుగ జెప్పవలయునా?

5. చక్కెర వ్యాపారముం జిల్లర చిల్లరగాజేసి జీవించువారలకు నీధర్మసంధి యమధర్మరాజు వంటి దాయెను. కెరోసిన్ నూనె వ్యాపారమున నెట్లో యిక్కడను నట్లే, శరణని వచ్చినవారి నాదరించి కాపాడుటయు, నాదారిని నేబోగూడదాయని స్వతంత్రతగోరి యస్వాధీనులైనవారి బాధించుటయునను క్షాత్రముందాల్చి నిర్వైరముగాబాలింప నుద్యోగించిరి.