పుట:Bhaarata arthashaastramu (1958).pdf/438

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మని యొడంబడిక జేసికొనిరి. ఇట్లు కొన్నినాళ్ళు జరుగగా నిది యెంతయుమేలని యేర్పడి నందున నీయొడంబడిక నింకను దృఢమ్ముగ జేయ నూల్కొని యిట్లాచరించిరి. 1. ప్రత్యేక సంఘములలోని భాగస్థులందఱును దమభాగముల నాపనికై నియమింపబడిన ధర్మకర్తల యధీనముచేయుట. 2. దానికిమాఱుగా నాధర్మకర్తల వద్దనుండి తమహక్కులను దెలియ బఱచు పత్రముల బడయుట. 3. ఇట్లు ప్రతిసంఘముయొక్కయు వారసుదార్లుగా నేర్పడిన ధర్మకర్త లాలోచనసభగానేర్పడి యీ సంధికార్యము నిర్వహించుకొఱకు జోదకుల నియమించి వారికి సర్వాధికారము నిచ్చుట. 4. ఈసమయములన్నియు శాశ్వత సమయములని యెల్లరును సమ్మతించుట. ధర్మసంధులనబడు నిర్మాణముల ముఖ్యములైన విధులియ్యవి.

చూడుడు! పేరునకు బ్రత్యేక సంఘము లింకను నుండుటచేత వానికిని గౌరవము లాఘవము నొందలేదు. అయినను వానికి స్వాతంత్ర్య మస్తమితము. అధికారమంతయు గొందఱ చేతిలోనికి వచ్చినది. కావున వ్యాపారము పూర్వమునకన్న విస్తరించిన యేక కళగాజేయుట సుసాధ్యము.

ధర్మసంఘచోదకుల ప్రవర్తన

1. స్పర్ధచేత హెచ్చుతగ్గులుగా బనిచేయు నాళ్ళలో గొన్నిశాలలు మూయబడియుండుట, కొన్నింట దినమంతయు బనిజేయుటకుగాక యర్ధదినమో ముక్కాలుదినమో పనిచేయుట, సమధిక వ్యాపార సమయములలో రేయింబవళ్ళుం బనిసేయుట. ఇట్లు కార్యము తాఱు మాఱుగ నుండెను. ఈ స్పర్ధ యంతర్థానమైనతోడనే పిశాచి పట్టిన వడువున నాడుటమాని కార్యము నేకగతిం జరిగింప ననువైనందున నాముప్పది నలువదిశాలల ఉత్పత్తినంతయు పదిపదునైదింట నిరంతర శ్రమతో దయారుచేయుట సులభమాయె. అందుచేత జోదకులు సగముశాలల విక్రయించివేసి తక్కుంగల వానితోనే