పుట:Bhaarata arthashaastramu (1958).pdf/437

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంధియనగా జనులొక్కటిగాగూడి చేయు సాధారణ వ్యవహార సమాజముగాదు. దానికన్న ఘనమైనది. ఇట్లేర్పడిన కంపెనీలే సంధిజేసికొనుట. అనేక మూలధనాఢ్యులు కూడినది వ్యాపారసంఘం. ఇట్టి సంఘము లనేకములుగూడిన నది సంధిసంఘము. సంధియు సంశ్లేష విధానములలో నొక్కటి.

సంధిసంఘము లేర్పడుటకు గారణములు

1. వర్తమానమున నశేషధనరాసులతో జేయబడు విస్తార వ్యవహారము లఖండముగ వ్యాపించి యున్నవి. ఇయ్యవి యొండొంటి మీద వైరమత్తి కాలుద్రవ్వుటచే నమిత స్పర్ధవలనగలుగు నాపదల కన్నింటికిం బాత్రములగును. కొంతకాల మీరీతి జలముతో బోట్లాడి యన్నిసంఘములవారును నొచ్చి నశించినవారై యికముందు పొందికతో బనిచేయుదమని సంధిక్రియ కల్పించుకొందఱు.

2. విస్తార వ్యాపారములవలని లాభములన్నియు నింకను సవిస్తరముగ వ్యాపారములంజేసిన మిక్కిలిగ బడయవచ్చుగాన నీసంధులకు నివియు హేతుభూతంబులు.

నిదర్శనము. చక్కెరజేయు మహాశాలలు, అమెరికాలో గొన్నియేండ్లక్రిందట ముప్పది నలువది యుండినవి. ఇవి యొకదానికన్న నొకటి మిన్నగ నుండవలయునను చొఱవతో బనిచేసినందున గలిగిన ఫలము లెవ్వియనిన:- 1. కొన్నిసమయమ్ముల నుత్పత్తి యమితమై వెలలు డీలువడుటచేత నందఱకు నష్టమువచ్చుట. 2. కొన్నిశాలలు దివాలెత్తుట. 3. అందుచేత భీతిగొని యుత్పత్తి కొఱతవడ జేసినందున సరకు చాలక పోవుటచే వెలలు మిక్కుటములగుట. ఇట్లనేకవిధమ్ముల వ్యాపారులకు స్థితిగతులు చంచలములైనవి. తఱువాత నీసంఘములయొక్క చోదకులందఱు నొకటిగా గుమిగూడి మాట్లాడుకొని చక్కెర వ్యాపారముయొక్క యానాటి చందముంజూచి దానికి దగినట్లు స్పర్ధలేక తమలోదాము పనిని బంచుకొని చేయుద