పుట:Bhaarata arthashaastramu (1958).pdf/436

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తొమ్మిదవ ప్రకరణము

స్పర్ధను రద్దుపఱచు తంత్రములు

మాత్సర్యము నిరోధింపజేయు వ్యవహారముల పద్ధతులు

ఆర్థిక మాత్సర్యముచే బెక్కువిధాల ముప్పులు మూడుననుట యేర్పడియె, వానిలో ముఖ్యములైన వానిని మఱల మీకు జ్ఞప్తికి దెత్తుము:-

1. ఉత్పత్తికిబట్టు వ్యయము హెచ్చుట.

2. ఉత్పత్తి క్రమముగా జఱుగక యొకప్పుడు లోపమును మఱియొకప్పు డమితసమగ్రత్వముం జెందుట.

3. ఇందుచే వెలలు నిలుకడలేక యుయ్యెలలూగుట.

4. నష్ట వచ్చినప్పుడు కర్మశాలలు మూయబడుటచే శిల్పులకు జీవన మనిత్యమగుట.

5. తుదకు క్షోభలుగలిగి యార్థికచక్రముం గలంగజేయుట, ఇత్యాదులు.

కీడులకుం బాత్రములుగాని వ్యవహారముల నిర్మింపవలయునని యిప్పు డిరువది ముప్పది సంవత్సరములుగా ననేక ప్రయత్నములు జఱుగుచున్నవి. వానియందు గణ్యంబులైనవి యెవ్వియనిన:_

వ్యవహార సమాజములు ధర్మసంధి జేసికొనుట

[ట్రస్టులు నాబడు ధర్మసంధులు]

ఇవి మొట్టమొదలు ప్రబలత్వమునకు వచ్చినది యమెరికాలో, 1882 వ సంవత్సరమున వ్యవహార విశ్వకర్మమ్న్యగు రాకిపెల్లరు మార్గ దర్శియాయెను. అదిమొదలు వీని విజృంభణము, అంతము నడ్డునులేక ప్రసరించుచున్నది. వర్తమానమున నివి యమోఘ విక్రమములై యుంటబట్టి విపులమ్ముగ జర్చింపవలయు.