పుట:Bhaarata arthashaastramu (1958).pdf/431

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూలధనము, అరువు, వీనిని శిధిలములం జేయునంత బలవంతములైనంగాని ఖండక్షోభలు నేరుగా మహాదారుణములైన యఖండక్షోభలుగావు.

కొన్నిసమయములందు వస్తువులన్నియు నభివృద్ధిం జెందుచుండినను సర్వోత్పత్తులు నమితములైనవో యను భ్రమను గలిగించునట్టి వికారములు పొడసూపుటయుంగలదు. " ఇపుడే యెల్ల పదార్థములును విస్తరించిన నమితత్వదోషమురాదని యంటిరి. ఇంతలోనె విరుద్ధ రామాయణము జేయుచున్నారే?" అని యందురేమో? చిత్తగింపుడు.

క్షోభలయొక్క యొకలక్షణము - వెలల వ్రాలుట

వెలలు వ్రాలువిధములు రెండు. 1. ఏదైన నొక వస్తువు యొక్క రాశి యధికమైన దాని వెలలు తగ్గును. స్పష్టము. 2. రాష్ట్రములోని నాణెములు - అనగా శాసనస్థాపిత రూప్యాదులు - మిక్కిలియు లోపించిన నప్పుడొక వస్తువుయొక్కయేకాదు, అన్ని వస్తువుల వెలలును తగ్గును. మనపెద్దలు "మేము గచ్చకాయ లాడుచుండిన పురాతనదినములలో నొక రూపాయకు పుట్టివడ్లు దొరకుచుండెను. ఇప్పటివలె మాచిన్ననాటి దినములలో వెలలు ప్రియములుగలేవు" అని వర్తమానకాలముమీద నేరముమోపుట వినియున్నాముగామా? అప్పుడు వెలలంత తక్కువగ నుండుటకు గారణమేమనగా రూపాయలు కొద్దిగనుండుటయే అపురూపముగ గనబడెనేని రూపాయలను వరహాలగ జూతురు. ఈ న్యాయముయొక్క యాదేశ మేమనగా:- వ్యవహారులు విశేషించి యన్ని వస్తువులను వృద్ధికిదెచ్చిరిపో, అవి యమ్ముడుపోవులోపల నేకారణముచేనైన రూపాయలసంఖ్య మిక్కిలిగా తగ్గెనేని వెలలుం దగ్గును. అందుచే నాదాయము క్షయించును. అడాయము చయించినను దమకు ఋణమిచ్చినవారికిని నుపకరణ