పుట:Bhaarata arthashaastramu (1958).pdf/424

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యాపారమున నత్యుత్పత్తి - సమర్థమైన జనాదరమునకన్న మించిన రాసులుండుట - జనించినట్లు.

2. కొందఱు తెలివితక్కువవారు, అర్థనిమిత్తమైన వైరంబుచే బరదేశస్తుల ధనమంతయు గొల్లగొట్టుకొని తమ దేశములో రాసులువోసికొన్న నెంతమేలని భ్రమింతురు. తాము వ్యాపారముల జరుపు రాజ్యములు పాడిండ్లబోలెనైన పిమ్మట వర్తకము జఱుగుటెట్లు? మనమెల్లరు ఘోరమైన దారిద్ర్యముం జెందితిమేని, ఇంగ్లాండువారు మనయెడల దాని వర్తనముం జూపనౌనెకాని పరివర్తనముజేయుట పొసంగునా? కావున నర్థిప్రత్యర్థు లిరువురును బచ్చగా నుండకపోయిన నిరువురును నెండుదురు. అర్ధవిషయమైన వైరము లేదనుటగాదు దీనికర్థము - అయ్యది మితిమీఱిన లయకారణంబగుననుట.

3. మూలధనం బమితమగుట. ఇందుచే వడ్డీతగ్గును. నయముగ ధనము చేతబడియెడు గదాయను కుతూహలముచే ననేకులు నూతన విధములైన యుద్యమములం బ్రవేశింతురు. ఎన్నియో వెఱ్ఱివెఱ్ఱి ప్రయత్నములు ప్రబలును. ఇందనేకములు శిధిలములౌట స్వభావ గమ్యంబుగావున మూలధనము వినియోగించినవారు కొంతవడికి వీతోత్సాహులై నమ్మకము ధృతియు దఱుగుటచేత నన్నికళలకుం బ్రళయమువచ్చెనో యను మాడ్కి తమ ధనము రాబట్టుకొన దండోపతండములుగ మంచివ్యాపారములు సెబ్బఱవ్యాపారములును భేదములేక మూర్ఖమగుపట్టుతో నప్పుదీసికొన్నవారినెల్ల దక్షణమే బదులిచ్చి వేయుడని బాధింతురు మూలధనము యంత్రాదులయందు లీనమై యుంటజేసి వ్యాపారులు తలచి నప్పుడు వానిని ధనముగా మార్పనేరరు. లాభము వచ్చుచుండిన దానిలోనుండి మిగిలింపబడిన ద్రవ్యముతో ఋణములదీర్చుట వారి సంప్రదాయము. ధనము వారియెడ నిక్షేపించియున్న వారందఱును, ఉన్నట్టుండి ఇపుడే మాది మాముందు దెచ్చిపెట్టుడని పిఱికి పట్టుబట్టిపలికిన వారేమి చేయ