పుట:Bhaarata arthashaastramu (1958).pdf/423

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దీఱలేదే" యని యందురే? ఇక నమితవస్తుసృష్టికిం జాలిన బ్రహ్మలున్నారా? వారికెన్నితలలు? ఎన్నిచేతులు?" అని యడుగ వచ్చును. వీరికేమని ప్రత్యుత్తరమిత్తుము? ఆశ లమేయములుగ నుండుట నిజమే. వస్తువుల నుచితముగ దానముంజేసిన హిందూ దేశీయుల సమారాధనకే చాలక పోవును? కాని యట్లిచ్చిన వ్యవహారుల కేమిలాభము? వారివ్యయమైన వారికి దొరకునా? కావున గిరాకి యనగా రిత్తయాశగాదు. బదులు వస్తువులో ధనమునో ఇచ్చితీసికొనుశక్తి వాంఛలబట్టిచూచిన ముల్లోకముల సంపదలును జాలనవియే! క్రయశక్తింబట్టిచూచిన నత్యుత్పత్తి యప్పుడప్పుడు ప్రత్యక్షమౌ నుత్పాతమే.

అత్యుత్పత్తివలని యపాయములు

1. యజమానులకు నష్టమో నాశమోవచ్చుట. 2. దానిచేత గళాశాలలు మూయబడి శ్రమకరులకు స్థానభ్రంశము, ఉపవాసవ్రతము గుదురుట.

అల్పోత్పత్తిచేగలుగు నపాయంబులు

1. ఇవి మనకుం బ్రాతబంధువులు. క్షామములను గుఱించి హిందువుల కుపన్యసించుట యధిక ప్రసంగము. ఒక్కకాఱువానదప్పిన జనులెట్లు మలమలమాడిపోదురో చెప్పదీఱునా? అల్పోత్పత్తి యొక యెడ గలిగినచో నది కారణంబుగ నధికోత్పత్తి బాధలన్నియు నింకొక యెడం జెందుటయుగలదు. ఈవింత యెట్లందురో, చూడుడు! మనదేశమున ననావృష్టి యేతెంచెనేని ధాన్యములవెలలు హెచ్చును. ప్రజలు తమ సర్వస్వమునంతయు బొట్టల నింపుకొనుట కుపయోగింతురు. దానంజేసి బట్టలకయ్యెడి వ్యయము క్షయంబునొందును. అనగా బట్టలకు గిరాకి తగ్గుననుట. అందుచే నింగ్లాండులోని ఎగుమతి వర్తకులకు వస్తువులు సెలవుగాక నష్టమువచ్చును. అనగా వస్త్ర