పుట:Bhaarata arthashaastramu (1958).pdf/422

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధికోత్పత్తి క్షోభ

అధికోత్పత్తికి గారణము లేవనగా:-

1. విస్తార వ్యాపారశాలలు. మహాఘనములైన యంత్రముల నూరకయుంచిన జెడి పోవును. కాన వెలలు దిగుట కారంభించినను నిలుపక యుత్పత్తిజేతురు. ఇందుచే ధర లింకను బతితము లగును.

2. ఒకవృత్తిలో ననేకములైన గంభీరశాలలున్న నొండొంటిం గడచి విక్రయముల నాక్రమించు కొనునాసతో ప్రతిశాలయందును సాధ్యమైనంత రాసుల సిద్ధపఱతురు. అట్లగుట మొత్తముమీద గిరాకికన్న సరఫరా యెక్కువయై యందఱకు నష్టముగల్గించు.

3. ప్రకృతమున బ్రతిరాజ్యమువారును బరమండలములనుండి వస్తువుల ననర్గళముగ దిగుమతి జేయనిచ్చిన దమదేశములోని వ్యాపారులకు నష్టమువచ్చునను శంకచే నధికముగ శుల్కములవిధించి సులభముగ బరపదార్థముల రానియ్యరు. ఎగుమతులకు బ్రోతాహముం జూపుటయు దిగుమతుల నాపుటయు నింగ్లాండుదక్క తక్కిన రాజ్యములం దన్నింటను మిక్కిలి శ్రద్ధతో నుద్ధరింపబడు పద్ధతిగా నున్నది. ఇందుచేత నుత్పత్తిచేసిన వస్తువులకు నిరర్గళ వినిమయ మలభ్యము. కావున నమ్ముడుపోక నిలిచి వ్యాపారులకు నష్టము దెచ్చును.

"అయిన నొక్కటి. ఏమి? అధికోత్పత్తియను ప్రళయ మొకటి యున్నదా? వస్తువులు చాలక కోట్లకొలది జనులు తమ వాంఛల దీర్చుకొనలేక పరితపించుచుండగా నాదరమునకు మీఱిన రాసులున్నవనుట యాశ్చర్యముగాదా! చెప్పువారికి మితి లేకున్నను వినువారికి మతిలేదా? ధాన్యములు, వస్త్రములు, బండ్లు, మిద్దెలు, మేడలు, పట్టుదుకూలములు, ఆభరణములును నొక్కహిందూదేశములో నుండు వారికి నాశదీఱునట్లియ్యవలయునన్న భూలోకములోని యుత్పత్తి యంతయు మూటగట్టితెచ్చి పంచినను "ఇంతేనా, కాలువాసికఱవైన