పుట:Bhaarata arthashaastramu (1958).pdf/420

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ మతమునకుం బ్రత్యాఖ్యానము:-

స్పర్ధచే సహజముగ సమత్వము కుదుర్పబడుటకు నేరవేర్ప బడవలసిన సమయములెవ్వి?

1. గిర్రకి హెచ్చిన నాక్షణమే సరఫరా హెచ్చుట.

2. గిరాకి తగ్గిన నాక్షణమే సరఫరా తగ్గుట.

3. ఉత్పత్తి జేయువారు క్షణమాత్రములో దమసాధనములైన యంత్రములు మొదలైన వానితో గూడ వృత్యంతరము జెందునంత చరత్వము గల్గియుండుట.

అనుభవములో నీసమయములన్నియు నమానుషములు, అసాధ్యములు, అసంభవములు, సద్య:కాల పరివర్తనము నాధారముగా గొని వాదించువారు ఋషీశ్వరుల కాలములో హిందూదేశములో నవతరించియుండి యా వాసన నింకను వదల కున్నారేమో! ఏలన నాకాలములో సంకల్పమాత్రమున, ముఖ్యముగా సంతానకృషిలో, జయమునొందుటయందు మనఋషు లఖండప్రభావులై, సద్యోగర్భమను పేర బది నెలలుపట్టు కార్యము నిమిషమాత్రములో నెరవేర్చి, యుల్లాసముతో బిల్లల నీనించుచు, పామరధర్మమగు మమతనంతయు విడిచి, యేమాయెనని వెనుకకు దిరిగియైనంజూడక, తమదారిని బోవు చుండిరనుట మహాసత్యముగదా! ఈకలియుగములో సత్య:కాల కార్య సిద్ధులును నాఋషులతో నంతర్ధానమైనట్టున్నది! మనము కాలపాశ బద్ధులము. భార్య భయపడినను ప్రొయ్యి భయపడి పనిచేయునా? కాలంబు గడవనిది ప్రయోజనములు పక్వదశకురావు.

1. యంత్రముల నొకపనినుండి యింకొకపనికి ద్రిప్పుట తలచిన మాత్రమున నయ్యెడి పనిగాదు.

2. పంట లమితము లయ్యెననుకొనుడు! స్పర్ధ యెంతయుండి మనసును గలచిననేమి? భూమిలో నిక్షిప్తములైయుండు నెరువు