పుట:Bhaarata arthashaastramu (1958).pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుమాట యసత్యమా ? కావున ప్రతిజాతికేగాక స్త్రీ పురుషులకు సైతము బాల్యము మొదలుగ నన్నియవస్థలయందును అన్నివేళల యందును నిట్టిట్లే నడవవలయునని లేచుట కొకశాస్త్రము, కూర్చుండుట కొకశాస్త్రముగా నిర్ణయించి, మనకెట్టి స్వాతంత్ర్యమునీయక, స్వతస్సిద్ధముగా మనకు గల్గిన శక్తియుక్తుల నుపయోగింపనీయక మృగంబులరీతిని, బొమ్మలమాడ్కి నాడించు దురాచారపిశాచమును దూరముగ దోలినంగాని మనకు సుఖాభివృద్ధు లేనాటికిని గలుగ బోవనుట ముమ్మాటికి నిక్కువము. పరిశ్రమము లేనందున దేహమెట్లో మనస్సును నట్లే కృశించును. దేహవికాసముగాని, మనోవికాసముగాని లేని దేశస్థులకు మోక్షము గతియగునా ? కావున తృష్ణారహితత్వము శ్రేయోహేతువనుట తప్పు.

ఇంతేకాదు. కోరికలు నానాటికి హెచ్చుటయే నాగరికతకును దేశాభివృద్ధికిని ప్రధానమైన కారణంబు. పక్షి మృగాదులకన్న మనుజులకు వాంఛలెక్కువ. శ్రీరాముల కాలములో నెట్లో యట్లే కాకులు నేటికిని గూళ్ళుకట్టుచున్నవి. మనుష్యులు నానాటికి నూతన విధముల నివాసంబు లేర్పఱుచుకొనెదరు. ఏనాదులు చెంచులు మొదలగువారు కందమూలములతోడను, పచ్చిమాంసములతోడను తృప్తి జెందుదురు. నాగరికత జెందినవారికి రుచులయందు నభిలాష యెక్కువగాన షడ్రసోపేతమగు మృష్టాన్నమున్నగాని సరిపడదు. హిందువులు భోజనముమాత్రము చక్కగానున్న జాలునందురు. వారికన్న నెక్కువ నాగరికతగల యింగ్లీషువారికి భోజనశాలయు నలంకారముగ నున్నంగాని యింపులేదు. వడ్డించువారు శుభ్రములగు బట్టలను ధరించినవారుగా నుండవలెను జిహ్వకేగాక నేత్రములకు గూడ నంతయు రమ్యముగనున్నగాని వారి కిచ్చగింపదు. కావున నింద్రియోన్మూలనముకన్న నిద్రియోన్మేషమే మంచిదని యెఱుగునది. బాలురంబోలె నింద్రియంబులను శాసించి యుత్తమమార్గమున