పుట:Bhaarata arthashaastramu (1958).pdf/417

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశేష రచితములైన యాభరణాదులకు మునుపు లేనియంత విక్రయ సౌలభ్యము గలుగుచున్నది. ఇందుచే విశేష రచితములకు సయిత ముత్పత్తి వినిమయమ్ములయందు శాలావిస్తరత సుసాధ్యమ. మఱియు గ్రామములు సీమలు పరీక్షార్థమై తిరుగు రాజ్యాంగోద్యోగస్థులు జాపితాలం బ్రకటింపనేరని యాసాములతో బేరసారములు జఱుప జాలరు. జాపితాలున్న, వానింజూచి వలయు ద్రవ్యంబులకై ముదలనిడుట చులకన యైనపని.*[1]

చిన్న యంగళ్ళవారికి శరణ్యములైన వృత్తులేవనగా:-

1. మరామత్తుపనులు. ఇవి స్వభావముచేతనే చిల్లర చిల్లరగా దటస్థించు లోపములు.

2. త్వరలో జెడిపోవువస్తువుల వ్యాపారములు. ఉదా. పచ్చి చేపలు. వీనిని మూకలుగా బ్రోగుచేసిన ముక్కునకు జేటేగాని లాభము మృగ్యము.

యానవృత్తులు:- ఇందు విస్తారవ్యాపారులకు నానాట బ్రవేశ మధికమయ్యెడిని. ఉదా. ట్రాంబండ్లు, ధూమశకటములు, ఇత్యాదులు గొప్ప గొప్ప సంఘములకుమాత్రము సాధ్యములు. జట్కాబండ్లలో గూడ కంపెనీ లేర్పడు చున్నవి. వీనియందు వైరములేని వ్యవహారము ముందునకు వచ్చుచున్నందున బ్రజల క్షేమము భద్రపఱచుటకై రాజ్యాంగము వారు చూచుకోవలసినదని యనేక శాస్త్రజ్ఞుల యభి ప్రాయము.

  1. * చిత్తరువులకుంజేరిన వస్తువుల సృష్టికి చేతిపని యావశ్యక ముగావున, వీనియందు విస్తారోత్పత్తి విక్రయములకు తరుణములేదు. రంగుల పొటగ్రాపులకన్న హస్తరచిత చిత్రపటములు సామగ్రుల యాకారముల బ్రకటించుటకు సుకరములు. వీనిని రంగులతో ముద్రించుట సులభము.