పుట:Bhaarata arthashaastramu (1958).pdf/416

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4. అరువుగానమ్ముట. అరువనగా నాణ్యముబట్టి ఋణముగా నిచ్చుట. గుర్తెఱుంగని మనుష్యుల నడవడి తెలియదుగాన విశ్వాసయోగ్యత నిర్ణయించుట యసాధ్యము. మఱియు రొక్కము నప్పుడే ముందు పెట్టవలసినదిలేదన్న నెక్కువ విక్రయములు వెలయగలవు.

5. హిందూదేశములో జాతిమతాదిభేదము లల్పశాలల కనుకూలములు. ఎట్లన, ప్రతితెగవారును ముఖ్యముగా భోజనపదార్థన్వేషణమ్మున సజాతీయులచే తడవుదురు గాన విక్రయములు కుఱుచ వడును. అందుచే నంగళ్ళు ప్రబలవిశాలములౌట యరుదు.

పశ్చిమదేశములో బ్రకృతము మళిగెలు విస్తరించుటకు సహాయకరములైన యాధారములు గొన్ని ప్రసిద్ధికి వచ్చుచున్నవి.

అవి యెవ్వియనిన:-

1. రొక్కపు వ్యాపారములు తఱచుగ నాచారములౌట.

2. ధనికులు తామే పణ్యవీధుల గౌరవహానియని తిరుగరు. మళిగెల యజమానులును వచ్చినవారికి దాసులట్లు మెలంగుట మర్యాదకు భంగకరమని యాశ్రయింపరు.

3. యానసౌకర్యముంటబట్టి దూరముననుండు షాపులును సమీపస్థములయట్లే యుండును.

4. పూర్వమట్లుగాక ప్రతివాడును దనకు జెలువములని తోచిన వానిన కొననెంచును. ప్రాచీనా చారముల ప్రకారము మనసుండినను లేకపోయినను దీయుదమనువారులేరు.

5. మఱియు నిప్పుడిప్పుడు రంగుల పొటగ్రాపులను (ఛాయా ప్రతిబింబములను) నెత్తుక్రియ పక్వమునకు వచ్చుచుండుటచేత దమ వస్తువుల యాకారము వెలయించు సరకుల జాపితాలను దయారుచేసి వాడుకకాండ్రకుం బంపుదురు. కావున దూరస్థులును వస్తువే సాక్షాత్కరించినట్లుండు నాచిత్రములంజూచి వరియింపగలరు. ఈ న్యాయముచే