పుట:Bhaarata arthashaastramu (1958).pdf/413

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంతేకాదు. దూరదేశస్థులు ఇక్కడివారినుండి కొనవలయునన్న దామే నేరుగ వచ్చుచు బోవుచు నుండవలయునేని, నాఇక్కట్టుచేత వర్తక మపహృత విన్యాసమౌను. అలంకార వస్తువులు కంటితో జూడనిది తీయుటకుగాదు. వర్తకుల వర్ణనలనమ్మి ప్రత్యక్ష పరీక్షసేయక భూషణములను, పట్టువస్త్రము లను, పలురకముల సుందరములైన తల గుడ్డలను నెవరైన గొందురా? కావున విరచితములకు నరచితములకుంబలె పణ్యసౌలభ్యములేదు.

పణ్యసౌలభ్యమనగా ననాయాసముగ దూరస్థులకైన నమ్ముడువోవు గుణము.

పణ్యసౌలభ్యమునకు నిదానములైన స్వభావము లెవ్వియనిన;

1. ఏకగుణము గలిగియుండుట. ఉదా. బియ్యము, రాగులు, పెసలు, గోధుమలు, ప్రత్తి, కడ్డీయినుము ఇత్యాదులు. వీనిలో రకములు బొత్తిగాలేవనుటకాదు. మఱియేమన, విరచితముల యందుంబలె నసంఖ్యాకములైన విధములులేవు. బయటియూరువారు సైతము వచ్చిచూడకయే గుణముల నించుమించుగ నిర్ణయింపజాలినంత యమిశ్రము లైయుండునవి. బట్టలయంగడివాడు ప్రత్తిబస్తానుండియు దుండ్ల గత్తిరించి పంపినగాని చూడకయే యుత్తరువులం బంపలేము. అపుడును శంక నిర్మూలమగుట యరుదు ఏలన చిన్నతునకగానుండునది రమణీయమైనను మన దేహచ్ఛాయకది సరిపోవునా పోవదా? చొక్కాయగా గుట్టించిన సమష్టిలో నింత బాగుగానుండునా? యను సందియము గొందుము. చొక్కాయిచేయించి తొడుగుకొన్నపుడు స్నేహితులామోదించి చప్పట్లు గొట్టినంగాని మనసులోని తహతహ తీరదు. ధాన్యాద్యరచితములయెడ కలవరమింత దట్టముగనుండుట యసాధారణము.

ప్రకృతి సిద్ధములైన వస్తువులలో మనుష్యసిద్ధములైన వానియందుబలె నానావిధములు లేకునికికి గారణమేమనగా, మనకన్న