పుట:Bhaarata arthashaastramu (1958).pdf/411

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యవసాయము. విస్తారకృషికి నియ్యది యనువైనదిగాదు. పొలములు చిన్నవిగానున్న మంచిదియా పెద్దవిగానున్న మంచిదియా యనుట యికముందు చర్చింపబడును.

సవిస్తరత యీరీతి ననేకభంగులం బ్రవర్తిల్లునదియైనను దానికిని నెల్లల విధించు నడ్డంకిపాటులున్నవి. అవి యెవ్వియన:-

సవిస్తరతను మితమునొనర్చు హేతువులు

1. యజమానులయొక్క కార్యనిర్వహణశక్తి. మనుష్యు లప్రమేయ జ్ఞానశక్తి సంపన్నులు గారు. తమశక్తి యుక్తులకుమించిన భారము దమపై మోపుకొందురయేని పనులకును దలలకును జేటు నిక్కువము. మఱియు వయసుముదురుకొలది నన్నివిజృంభణంబులు నడగుట సహజము. కావున వ్యాప్తియందలి యుత్సాహమును భగ్నమౌను. ఒకవేళ దన్నెదిర్చిన వారినెల్ల నడంగద్రొక్కినాడుబో, "ఇంకెవ్వరు సములు లేరుగా" యని పరిశ్రాంతుడౌటయు మనుష్య ప్రకృతియ.

తానెంత చతురుడైనను తనవెనుకటివాడును నంత చతురుండగుననుట సందేహాస్పదము. ఆస్థికింబలె శక్తికిని సంతతివారి నొడయలుగజేయు రహస్యమింకను ప్రకాశమునకురాలేదు. వీనికన్నింటికన్న ముఖ్యమును, ఆర్థికమర్మముల నంటునది యునైన కారణంబింకొండుగలదు. అదెయ్యదియనిన:-

ఉత్పత్తిచక్రము వినిమయచక్రముతో సంధించునది. అనగా వర్తకముతోజేరి యుత్పాదనక్రియ యున్న దనుట. ఇది పూర్వమే వివరింపబడిన విషయము. ఈ సంబంధముగాక యీ రెంటికిని విరుద్ధ భావ మొకటియున్నది. అదియేదనిన:-

వర్తకము గిరాకికి విధేయము. గిరాకి యనగా వస్తువుల యందలి మమత. ఇది త్వరలో బూర్తికి వచ్చునదియైన నమిత