పుట:Bhaarata arthashaastramu (1958).pdf/409

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. యంత్రముల ప్రవేశములకు విస్తార వ్యవహారముల యందు బలె నల్పవ్యవహారముల వీలులేదు. యంత్రములును శీఘ్రంబున బలమఱి మార్పబడునవిగాన నీవ్యయముభరింప సంకుచిత వ్యాపారులకు వలనుగాదు.

4. నూతనవిధములం బరీక్షించుటకు నాఢ్యులకేగాని యల్పుల కసాధ్యము.

5. గంభీర వ్యవహారులు ఖర్చులు గణింపక దేశదేశమ్ముల దమవస్తువులం బ్రకటించి వానియందు జనుల కాసక్తిని రక్తిని సృష్టింతురు. చిల్లరవారు వాడుకకాండ్రకేగాని పరిచయములేనివారికై వస్తువుల సిద్ధపఱచుశక్తికి దూరులు.

6. మొత్తముగాగొనుట. మొత్తముగా విక్రయించుట, అయ్యై చక్రంబుల దమయుద్యోగస్థుల నిల్పి వారిచే వర్తమానముల నెఱుంగుట, సుప్రసిద్ధమైన పేరుగాంచి తమయందెల్లరకు విశ్వాసముండునట్లు చేయుట, తుట్టతుదకు వైరుల నిర్జించి యేకచక్రంబుగా గార్యంబుల నడుపుట, ఇత్యాది ప్రచారములు బలవంతుల కుం జెల్లుగాని దుర్బలులకుం జెల్లవు. కావుననే యాధునిక సమయమున నెక్కడ జూచినను చిల్లర వ్యవహారములు సూర్యోదయంబున నక్షత్రముల మాడ్కి మఱుంగువడి మందభాగ్యము లౌచుండుట. మఱియు వృద్ధి వృద్ధికి గారణంబుగాన నెక్కువయౌకొలది నింకను నెక్కువగ బోవుట సుఘటము.

7. కర్మకరుల సంఖ్యయు నాతతముగ నుండుగాన శ్రమను లాభాపాదన పర్యంతము విభజించి ప్రతిక్రియకును నిపుణులైనవారి నియోగించుటయు విస్తార కళాశాలలవారికి లఘుతంత్రంబ.

8. వ్యవహారమండలియందలి స్థితిగతుల నరయుటకు ఘనులకు బోలినట్లు లాతివారలకుం బోలదు. నవీనవిచారణల కుద్యమించి యాను