పుట:Bhaarata arthashaastramu (1958).pdf/402

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గలయవిగను నుండవచ్చును. కావున గర్మశాలా విక్షేపమునకును వ్యవహార విక్షేపమునకును నంతరువు ఉండుట భావించునది.

వ్యాపారము సమష్టిని వ్యాపించుటలో నొక లక్షణము తఱుచు గానంబడియెడి ఎద్దియనగా సజాతీయము లయిన కళలు, ఏకస్థానమున గుంపులుగట్టుట. ఉదా. చెన్నపురి రాజధానిలో రత్నకంబళ్ళకు ఏలూరును, దంతపుబనులకు విశాఖపట్టణము, తిరుచనాపల్లి, మైసూరు, తిరువాన్కూరులును, పుట్టినిండ్లుగానున్నవి. మఱి బజారులలోసైతము మిఠాయి యంగళ్ళన్నియు దీపములతోను, ఈగల తోను దేజరిల్లుచు నొకేచోట బారులుగట్టియుండును. షరాపువర్తకమువారందఱు నొకేదిక్కున గుమిగూడి యుందురు. పుష్పలావికలును గుమిగూడి యొక్క యిక్క ఘమఘుమమని వాసనలు నలుదెసలబాఱ సరససల్లాపము లాడుచుందురు. చిల్లరయంగళ్ళొకప్రక్క మొత్తపుటంగళ్ళొకప్రక్క నీరీతి సాదృశ్యము ననుసరించి కళలు వ్యూహములు గట్టియున్నవి దీనికి స్థానసాంగత్యము, స్థానైక్యము ఇత్యాదులు నామములు.

స్థానసాంగత్యము - స్థానసాంగత్యముం బుట్టించు హేతువు లెవ్వియనిన:

1. ప్రకృతిగుణంబులు. శీతోష్ణాదిస్థితులననుసరించి ఉత్పత్తియు నుత్పత్తిననుసరించి వ్యాపారములును బరిణమించును. బెంగుళూరు మితశీతోష్ణమైన స్థలంబుగావున నచ్చట పట్టు పురుగులు బాగుగా వృద్ధికి వచ్చుటంజేసి వానికిం దగిన క్షేత్రములు తోటలు తత్పరిసరంబుల బ్రతిష్టింపబడుచున్నవి. బొంబాయిలో సుప్రసిద్ధుడగు 'తాతా' యను గొప్ప వ్యవహారి బెంగుళూరి సమీపముననుండు నేలలగొని పట్టు పురుగులకు నాశ్రయమైన కంబళిచెట్టు తోటల నాటించినందులకు నాప్రాంతము యొక్క శీతోష్ణ సౌమ్య స్థితియే కారణము. బొంబాయి రాజధానిలో దూదిపంటకు ననువైన నల్ల రేగడభూమి విస్తారముగ నుంటజేసి యా వ్యాపారమున కాసీమ యాకరమాయెను.