పుట:Bhaarata arthashaastramu (1958).pdf/401

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజ్యములలో, పండ్లులేని పులివలె మోసముల నాశ్రయించువా రుందురేకాని, యవక్ర విక్రమాఢ్యులు తరుచుగనుండరు. వీరిమాయలే తుదకు వీరల మాయించును. మనలోపములకుదోడు శాసనలోపము లును జేరియున్నవి. ఇంగ్లాండులోబలె దొరతనము వారిచే జేయబడు సమాజముల లెక్కలపరీక్ష, ఇచ్చట నంతకఠినముగాదు. ఇపు డైదేండ్లలో నెన్నియో కంపెనీలుపుట్టి గిట్టుటంజూచియు, సమాజ నిర్మాతలుసేయు చోరత్వముం బాటించియు, గవర్నమెంటువారు త్వరలో నీలోపమును నివర్తిచేయ నున్నారు. ఇండియా దేశములోని చట్టముల ప్రకారము నిర్మింపబడిన సంఘములు, ఇంగ్లాండులోని చట్టములచే నిబద్ధములైనవాని యంతవిశ్వసనీయములుగావు. ఇండియా గవర్నమెంటువారును, ఈ మాయల మట్టుసేయుమార్గముల రోయు చున్నారు. అనతి కాలమ్ముననే నూతన శాసనములు వెడలుననుటకు నిమిత్తములు కాననయ్యెడిని.*[1]

విస్తార వ్యాపారము

మూలధన సంశ్లేష పద్ధతుల గొన్నింటి వివరించితిమి. ఇక నద్దానికి బ్రయోజనరూపమైన విస్తార వ్యాపారముయొక్క గుణ దోషమ్ములం బ్రకటింతుము:-

విస్తరత ద్వివిధము. 1. వ్యాపారమంతయు వ్యాపించుట. ఉదా. మునుపటికన్న దూదివ్యాపార మిపుడెన్నియో మడుంగుల పొడవుగాంచియున్నది. 2. వ్యాపారము లకుంజేరిన కర్మశాలలు ఘనతర ములగుట. చూడుడు! వ్యాపారము వృద్ధిగన్నను నందులకుజేరిన యంగళ్ళన్నియు వృద్ధియగుననుట యేమినిజము? అంగళ్ళలో పోటీలు హెచ్చిన కొన్ని యాఱడివోవుటయు గొన్ని కఱగుటయు గొన్ని పెఱుగుటయు సంభవించును. మఱియు వ్యాపారము సముత్కటముగ నున్నను నందలి యంగళ్ళన్నియు చిన్నచిన్న విగను హెచ్చిన సంఖ్య

  1. * ఈ విషయమైన చట్టమొండు, ఇటీవల శాసింపబడినది.