పుట:Bhaarata arthashaastramu (1958).pdf/400

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తక్కువగ బ్రయాణముచేయ నిశ్చయించి, మూడవ తరగతి టిక్కట్టు దీసి యా తరగతిబండ్లలో బీద సాదలు సామాన్యముగ నెక్కవత్తురు గాన వారి నాపివేయమని, స్టేషనులోని పోర్టరును నడిగికొని, వాడట్లు పేరాసమైజేయ, రైలుగదలునపుడు వానిచేతిలో గంభీరంగా నఱణాపెట్టి, వానిచేత నాలుగు వషట్కారములం బెట్టించుకొని, సుమంగళముగ బోవుచుండుట యెవ రెఱుంగరు? దీనిచే నేర్పడు జాతిగుణము లెవ్వియనిన:- 1. తనయొక్క హక్కులకన్న నెక్కువగ గ్రసింపగోరుట. మనవారీషణ, ఈషణయనుదానికి నిజమైన యర్ధమియ్యదియ. 2. పరులయొక్క హక్కులను దిరస్కరించుట. 3. ఈ యన్యాయమును నీచమైన పద్ధతులచే నుద్ధరించుట. ఒక్కలంచములకేగాదు. దుష్టకష్ట చరిత్రంబులకు నెల్ల నియ్యవి యాకరంబులు పోలీసు, రెవిన్యూ, ఉద్యోగస్థులయెడ, సాధారణముగనుండు మీమూటికి సహాయముగ జనులు గడగడమనివణకు భీతియు బయలుదేఱి, మనల నెట్టి యకృత్యములకైన విధేయులంజేయుట సుప్రసిద్ధం. 'రైట్టు' ను దండితుంజేయు నుద్యమమున గవర్నమెంటువారు వెను దీసినను ప్రజలేచేరి ద్రవ్యముల జందావేసికొని సేకరించి కేసుచేసి పగదీర్చిరనియంటిమి. అట్టిరాజసము ధర్మసంస్థాపనశక్తియు నీదేశమున నేమాత్రమున్నదో మీకుదెలియదా? తమహక్కులను సర్వభంగుల రక్షింతుమను ధైర్యము, పరులయొక్క హక్కుల నాక్రమింపమను నౌదార్యము, ఈ రెండు గుణములు మొత్తముమీద ప్రాచుర్యమునకు రానిదేశముల యోగ్యతా విశ్వాసములు శుద్ధముగ నుండవనుట నిర్వివాదమైన న్యాయము. యోగ్యతయు విశ్వాసమును బరస్పర శరణ్యములైన గుణములు. వీని కాద్యము ధర్మమునందలి నిష్ఠ. దానికి నిదానములు ధీరధైర్య పద్ధతులు. అనగా బలవంతులజూచి తప్పులేనియప్పుడు భయముంగొనమియు, బలహీనులయెడ ననుచితవృత్తి భయము జూపమియును, రాజసగుణముల విసర్జించి దొంగ వేదాంతములకుదిగిన