పుట:Bhaarata arthashaastramu (1958).pdf/40

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

గీడుగలుగజేయు నిష్కామ్యతవలన తనకు మాత్రము మేలు కలుగు ననుట యత్యాశ్చర్యకరంబు

                 "కేవల నిష్కర్మత మో
                  క్షావహ మగునేని గిరులు - నవనీజములున్
                  భూవర : ముక్తిం బడయం
                  గావలవదె ? యడవి నునికి కైవల్యదమే ?" -భారతము.

అర్థాభివృద్ధిలేనిది దేశాభివృద్ధి కలుగదు. కోరికలు మున్ముందుగ వ్యాపింపవేని అర్థాభివృద్ధి యడరనేరదు. ఈ న్యాయములను హిందూదేశచరిత్రమునుండియే విశదీకరింపవచ్చును.

1. హీనకులస్థులైన మాలమాదిగెలు, ఒకచింపిరిబట్ట, కొంచెము రాగి, యంబలి, దొరకిన జాలునని తృప్తిజెందుటంజేసి, తరుణ మబ్బినను ఇంక నెక్కువ యేటికని పనిజేయక యూరకుందురు. ఇందుచే వారికి వృద్ధిలేకపోవుటయేకాదు. దినదినమునకు హైన్యస్థితికి కూడ వచ్చుచున్నారు.

2. మొత్తముమీద మనదేశస్థులు సోమరిపోతులు. ఇందునకు గారణమ్ములు రెండు కలవు. అందు మొదటిది, మనపూర్వులు పోయిన త్రోవనే పోవలయుననియు, గ్రొత్తమార్గము నవలంబించుట పాపమనియు దలచి యుండుటబట్టి నవీన వస్తువులు మంచివని ఎఱిగియు వానిని మానుచుండుట. తిరువాన్కూరిలో వేలకొలదిస్త్రీలు వారి పెద్దలు ఱవికెలు వేయలేదుగాన దామును వేయుటవిడిచి, చూచువారికి జుగుప్స బుట్టించుచు వీధులం బోయెదరు. వీరు తమదేహమును మఱుగుగా నుంచుకొనునంతటి నాగరికత గలవారైన, వస్త్రము లెక్కువగ నేయబడవా ? దైవవశమున నట్లెవరేని నాగరికతకు మూలమగు క్రొత్తత్రోవ ద్రొక్కినచో వారి కితరులవలన గలుగు కష్టములు చెప్పనలవిగాదు. అంత్యజులు గొడుగుల బూనిరేని నది సంప్రదాయవిరుద్ధమని శూద్రులుసైతము నీతివిరుద్ధములగు మితిలేని హింసలకు వారిని బాలుపఱుతురు. ఎట్టిభోగమునుకూడదని వితంతువు