పుట:Bhaarata arthashaastramu (1958).pdf/395

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నుండినను మొత్తముమీద చోదకు లడ్డులేని యధికారము గలవారగుదురు.

2. వర్తమానమున గొప్పగానుండు నౌకాయానము, ధూమశకటయాత్రలు మొదలైన గంభీర యత్నములు వీనిసహాయములేనిది రూపుజెందియుండవు.

ఇంక లోపములు

వీనియందు. సంయోగించునది మూలధనముగాని భాగస్థులు గారు. ఎట్లన, మదరాసు బ్యాంకీలో దేశదేశస్థులు భాగములు గొనియున్నారు. తమలోదమకు నేమాత్రమైన బరిచయముండుటయరుదు. ఊరుపేరు తెలియనివారితో నిక్కమైన పొత్తుగలుగుటెట్లు? భాగస్థుల క్షణమిది. వ్యవహారము నెఱుగరు; తమ్ము నెఱుగరు. పేరునకు మాత్రము యజమానులు.

2. భాగస్థులు ద్రవ్యము వేయుటతప్ప మఱేమియు జేయక యుండువారు. శిల్పులు కష్టించి క్లేశము లెల్లబడువారు.

3. అట్లయ్యును వచ్చులాభములో భాగస్థులకు బాలుగలదు. కర్మకరులకు నియతమగు కూలియేగాని యెక్కువగిట్టదు. సమష్టివాదులందఱు నిదియెంతయు నన్యాయమనియు ఘోరమనియు గోపింతురు. చూడుడు! గొప్పయాస్థికి బుట్టినవాడు జన్మమంతయు నేపనియుం జేయకయ భాగస్థతం దాల్చుటచేతనే మంచి రాబడిగలవాడు గావచ్చును. కూలివా డెంతపాటుపడిననేమి? నానాటికి భుక్తి సేకరించు కొనుటయే వానికి దుర్భరము. ఆధునికార్థికస్థితియందు 'కష్టీ ఫలీ' యనుట బొంకాయె. పాటులకన్న మూటలే మిన్నలాయె. ఇట్లగుట నిప్పటిస్థితి యధర్మంబు. అధర్మంబగుట శాశ్వతంబు గానేరదు.

4. ఇక భాగస్థులేమి తెలిసి భాగముల గొందురనగా, చోదకమండలియందలి నమ్మకముచేత. ఇది తెలిసి నిర్మాతలు చోదకమండలిలో వన్నెయు వాసియుగల పెద్దమనుష్యుల నెన్నియుపాయములచేనైన