పుట:Bhaarata arthashaastramu (1958).pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏడవ ప్రకరణము

విస్తార వ్యాపారములు

సంశ్లేషముయొక్క ముఖ్యప్రయోజనము వ్యాపారముల విస్తృతములంజేయుట. తన మూలధనముతో మాత్రము వృత్తిని స్థాపింపవలయునన్న గోట్లకొలది జనములు కొన్ని వందలకన్న నెక్కువ ద్రవ్యము వినియోగమునకుం దేజాలరు. ఎవరో కొందఱు కొన్నిలక్షల వేతురేమో! ఇట్లు మూలార్థము మితంబైనచో గళలయందు నమిత వ్యయ సాధ్యములైన యంత్రాదులకు బ్రవేశముండుటయరిది. అట్లగుట నుత్పత్తి ప్రముఖోద్యమంబులు చక్కగా గొనసాగవు. కావున విస్తార వ్యవహారములలోని గుణదోషముల గణించుట యావశ్యకము.

మూలధన సంశ్లేషణ

పూర్వము చిల్లర వ్యాపారములు తఱుచుగానుండు కాలములో ననేకులుగలిసి భాగము లేర్పఱచికొని, సమాజములుగజేరి నడుపు కళలు మిగుల గొద్దిగానుండినవి. ఇప్పుడు నాగరక దేశములలో సమాజో ద్యోగము లపారముగానున్నవి. కారణమేమనగా వ్యవహార చక్ర మఖండముగ వ్యాపించియుండుటయ. ఈ వ్యాప్తిచే నధిక రాశి కళలకు మంచి యనువు కలిగినది. అధికరాశికళల సాధించుటకు జనులు పొత్తుచేరుట యావశ్యకంబు.

ఉత్పత్తికి నాధారములు మూడని యంటిమి. ప్రకృతి, శ్రమకరులు, మూలధనము. ప్రకృతి స్థావరము. కర్మకరులు కదలిక గలవారయ్యును దేశవేషభాషాది తారతమ్యములంబట్టియు నాలుబిడ్డల యందలి యనురాగవిశేషంబునంజేసియు విచ్చలవిడిగ దిరుగజాలరు. మూల ధనము ద్వివిధము. చరము, అచరంబుఅని. అచరములు యంత్రాదులు. ఏకవిధ ప్రయోజనములు. కాని నివియు దిశలం బ్రాక