పుట:Bhaarata arthashaastramu (1958).pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రైల్వేలవల్ల, కచ్చేరీలవల్ల, కలిగినంతమాత్రము సకారణములైన యుపదేశములవల్ల గలుగ లేదనుట వేఱుగ నెత్తిచూపవలయునా? మనుష్యులను వశవర్తులంజేసి వెలుంగు యంత్రము వివేకముగాదు. అట్లదియే యనుపక్షమున మూఢభక్తి యింకను 'కనకపు సింహాసనమున శునకము' వలె నీరాజ్యము నేల యధిష్టించియున్నది? సరికాదని నిరూపించిన మాత్రమున విధవలకు వికార వేషముగట్టు ననాచారము వదలు వారున్నారా? కావున వివేకమునకన్న విమూఢత్వము విశేష శక్తియుతము. అట్లగుట యోచనతో భావికాలమున దీర్పజూచుట తెలివితక్కువ తలపోత. మఱి మనుష్య సంఘముల నుండు ప్రకృతి శక్తులంబోలిన స్పర్ధాదులకు విరోధముల గల్పింప జూచుటయు బిచ్చితనము. ఎట్లన, నీయందు నాయందును స్వేచ్ఛకు దారియున్నదిగాన సంఘమం దంతగాలేదు. ఏవిషయముం గూర్చియైననుసరే సమ్మతి నడిగితిమేని కొందఱౌనందురు కొందఱు కాదందురు. సమ్మతులు పరస్పర విరుద్ధం గావున మొత్తముమీద సంఘములో దేలు సంకల్పము సున్న కావున బ్రభుమార్గమున సమష్టిపద్ధతి నుద్ధరింపంజూచుట పొసగదు.

మఱియు నీప్రభుమార్గ మసాధ్యమగుటయకాదు. అనావశ్యకమును. ఎట్లన రాజ శాసనముల సహాయములేకయ సమష్టి స్వతసిద్ధముగ దిగ్విజయయాత్ర కారంభించినది. యజమాన సంఘ ములు, శ్రమకర సంఘములు, ట్రస్టులనబడు ధర్మనంధులు, విస్తార వ్యాపారములు, యాన సౌలభ్యము, అన్యోన్య తాసరణులు ఇవన్నియునేమి? ఆధునిక లోక పరబ్రహ్మయగు నాసమష్టియొక్క మూర్తులేకదా! మఱియు శ్రమకర సంఘాదులు కూడవని రాజశాసనములు వాని శిక్షింపజొచ్చినను నవి యాపబడినవా? లేదు. ఆపుటకే బలములేనిది ప్రోచుటకు బలమెక్కడనుండి బిచ్చమెత్తి తేగలదు? కావున సమష్టికి నాయకత్వముం గోరుదమేని వర్తమానస్థితిలో సంగతములైయుండుశక్తుల సహజ క్రమమునం బోవనిచ్చిన జాలును. అవే సమష్టిని నపౌరుషముగ దమంతట పరిణతికి దెచ్చును. వీరి మంత్రమునకు నాధారమైన యూహయేదనగా. ఆర్థికన్యాయములలో వర్జనీయంబు లైనవి ప్రకృతి న్యాయంబులంబోలిన స్వశక్తియుతంబులైనవనుట.

ప్రభుమార్గ సమష్టివాదుల యుత్తరము

ఆదిని మనుష్యులు మృగంబుల బోలినవారు. స్వాతంత్ర్యమును దీర్ఘ దర్శనమును దొలుత మొలచిమొలవనిస్థితిలోనుండినవి. ఇపుడన్ననో యివిరెండును నానాటికి వృద్ధిని వీర్యమును బడయుచున్నవి కావున ముందువోలె గ్రుడ్డియెద్దు చేనిలోబడినట్లు పోవలసిన విధిలేదు. కావున నిచ్ఛాశక్తులుగల మనము బుద్ధిని బ్రయోగించి భావికాలము నేల వంగదీయరాదు?

మఱియు శాసనము లుపయోగములేనివికావనుట మాప్రతివాదులు నొప్పుకొనెదరు. అట్లగుట శాసనములను పగ్గములతో నార్థికశక్తుల నేలనడిపింప గడగరాదు?

సమష్టీశక్తి సహజముగ బ్రత్యక్షమౌననియంటిరి. అట్లగుటలో మాకేమియు దు:ఖం లేదు. కాని, మనమును గొన్ని క్రియలజేసి యారాధించిన మఱింత త్వరలో బ్రసన్నమగునుగదా!