పుట:Bhaarata arthashaastramu (1958).pdf/388

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నను నట్లుచేయుట తగనికార్యము. మఱియు నాధునిక స్పర్ధలు సంఘములకు కీడు సేయునని నమ్మినవారు స్పర్ధల నిరోధించు నన్యోన్యత, సంఘపరిపాలన, ఇత్యాదిపద్ధతుల నాశ్రయింపం బూను దురు. దీనిచే నార్థికలోకమున నూతనసృష్టు లెన్నియో కలుగ నున్నవనుట స్పష్టము. కావున మానవులకు నీతియందుండు నాదరమును నార్ధిక భావములకు మూలము నిష్పక్షపాతమును, బీదసాదల కనుకూలించునదియునగు మృదుమార్గము నవలంబింపవలయునను స్వేచ్ఛాపూర్వక సంకల్పముగలవారివలనే సమష్టిపద్ధతులు. ఇకమీద వివరింపబడు నన్యోన్యతా పద్ధతులు నాచార ములోనికి దేబడుచున్నవి.

అయిన నొక ప్రశ్న - ఏమీ? ఆధునికస్థితి స్వేచ్ఛాపూర్వకముగ మనుష్యులు కల్పించు కొన్నదికాదా? మఱి వాన, యెండ మొదలగు నైసర్గిక ద్రవ్యములరీతిని బ్రకృతి న్యాయములచే సిద్ధించునదా? మనుష్యులు నేటివఱకు బొమ్మలవలె నాడింపబడు చుండిరా? కొంచెము యోచింతము.

ఇంగ్లీషువారు హిందూదేశము నాక్రమించుకొని పాలించుచుండుట మీకెల్లరకుం దెలియుగాదె! 200 సంవత్సరములపుడు వారు వ్యాపారార్ధ మీదిక్కు వచ్చినపుడు రాజ్యస్థాపనంగూర్చి చింతించిరా? లేదు. ఇది యపుడు వారి యుద్దేశ్యము గాకుండెను. ఉద్దేశ్యమునలేనిది సిద్ధికెట్లువచ్చెనందురో! సహజక్రమములచేత. ఎట్లన, వ్యాపారార్దము ఫ్యాక్టొరుల గట్టిరి. మనరాజులాకాలమున నొండొరులతో గుక్కలరీతి గాట్లాడుచుండుటచే దొంగతనము, బందిపోటులు మితిమీఱియున్నందున ఫ్యాక్టొరీల రక్షించుకొనుకొఱకు సొంతముగ సైన్యముల నాయత్తపఱచిరి. వీరి యాశ్రయమున బ్రతుకు బాగుగ నున్నందున శిల్పులు, వర్తకులు తండోపతండమ్ములుగ వచ్చుటయు దన్మూలమున బల్లెలు పట్టణ ములగుటయు సంభవించె. అరీతి పాలనకార్య మంకురించెను. అంకురించినదింక పెఱుగక యుండు నా? రాజులలో దామును రాజులై నిల్చినపిమ్మట సంధి విగ్రహాది తంత్రములకుం బూనకుండుట యిట్టి యరాజకదేశములో నసాధ్యము. తంత్రములకు ఫలముగ జయము, జయమునకు ఫలముగ రాజ్యవైశాల్యమును వెన్వెంట వృద్ధినొందగా నీరీతి బేరసారములకై వచ్చినవారు సార్వభౌమపదవిం జెందువఱకును విడువక రాజసవృత్తితో బ్రబలిరి. మనుష్యజీవితమందు సైతము కార్యకారణములు ప్రకృతి న్యాయములట్ల మనకుమించి మనల నీడ్చుకొనుపోవు స్వభావముగలవిగానున్నవి. ఇందునకు నితర దృష్టాంతములు వలయునా? హిందువులమగు మనజీవితమున స్వతంత్రత యేమాత్రమున్నది? కర్మముచేత బుట్టుకయేర్పడుట నిజమో దబ్బఱయోకాని పుట్టుకచేత గర్మమేర్పడుట పండిత పామర వేద్యము. ప్రతివానియు స్వేచ్ఛయే బక్కపడి యుండగా సంఘము మొత్తముయొక్క స్వేచ్ఛ యింకను బలమఱియుండు ననుట కేమిసందేహము? అదెట్లన, చేరబిలిచి బోధచేసి యెవనినైన నొకని మూఢభక్తి వదలునట్లు చేయుట కష్టమైనను నసాధ్యముగాదు. అట్లే సంఘమునంతయు మార్ప వలయునన్న మనతరమా? నేను విదేశయాత్రచేసి నవనాగరకుడ నైనందున మావారికి బ్రాచీనగంధ మేమాత్రమైన బలుచనౌనా? పారంపర్యముగవచ్చు సాంద్రతను నాగంధమేల వదలును? కావున స్వాతంత్ర్యము ప్రతివానియందును ననేకభంగుల నడ్డగింపబడి వుండును.