పుట:Bhaarata arthashaastramu (1958).pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మార్తుము. ఎట్లన, ఉష్ణముచే గొన్నివస్తువులు విస్తృతమలౌను. కొన్నికావు. అగువాని గుణంబు లియ్యవి, కానివాని గుణంబులియ్యవి, అని నిర్ణయింతుము. ప్రకృతి న్యాయము లమోఘంబు లనుట కిదియ యర్థము. అనగా న్యాయమెక్కడచెల్లదో యక్కడ చెల్లుట కనువైన తీరున న్యాయములనే దిద్దుదుము. ప్రకృతియొక్క స్వభావములను వర్తనములను దెలుపు న్యాయములు మనుష్యులచే గనుగొనబడినవి మనము సర్వజ్ఞులము గాము కావున నందు బొరపాటు లెన్నియో కలుగకపోవు. అట్లగుట మనచే నిర్దిష్టములైన న్యాయములకు బ్రకృతికిని భేదము గల్గెనేని ప్రకృతిని మార్పజూడము. ఏలన నది మనకు తరముగానిపని. మార్చుటకుగాదు కావుననే దానియెడ నింద నారోపింపము. అపరాధము విధింపము. మఱి యీ భిన్నత మనయజ్ఞానముచే వచ్చినదని యింకను జక్కగ బరీక్షించి న్యాయమునే సంస్కరింతుము. అట్లయిన ప్రకృతి న్యాయము లమోఘములెట్లు? నిర్వికారములెట్లు? అనగా నిట్లు. ప్రకృతి నిర్వికారము. నిరర్గళగమనముగలది. కాని దానిస్వభావము మనకు సంపూర్ణముగ గోచరించునో లేదో! అట్లగుట మనచే నిర్ణయింపబడిన న్యాయములు శాశ్వతములని దృఢముగ జెప్పగాదు. మఱి మనతర్కమేమనగా, ప్రకృతియొక్క నిజస్థితి నెఱింగితిమేని, తద్వర్తనములదెలుపు న్యాయములు ప్రకృతియట్లు శాశ్వతములు నఖర్వములునై వెలయుననుట.

కావుననే రాజశాసన నీతిశాసనములు, అతిక్రమమునకుం బాత్రములు. ప్రకృతియం దతిక్రమం బఘటమానంబు దేశకాలాదులను సరకుగొనక దైవమానుషముల నడ్డసేయక, శుభాశుభముల లెక్కపెట్టక, ఏకక్రమమున నిర్వికారతం బోవునది ప్రకృతి. చూచితిరా! నిర్వికారమన నచలంబుగా దనుట కొంకొక ప్రమాణము.

"ఈతర్కంబుతో భారత నర్థశాస్త్రంబున కేమిపని? ఎంతపని?" అని యందురేమో! ఎంతోపని! ఈ శాస్త్రమున న్యాయము లనబడునవి యేతరగతికింజేరిన న్యాయములని నిర్ధారణచేయుట మాన నగునా? కాదు.

కొన్నిన్యాయంబులు ప్రకృతి న్యాయంబులతో దుల్యంబులు. ఉదా. హీనవృద్ద్యాదులు. వీనికి విఱుగుపాటు, అలయుపాటు, మొదలగు పాటులెవ్వియులేవు.

మఱికొన్ని శాసన సమంబులు. ఉదా. 1. పన్నులుగట్టవలయుట. 2. రాజ్యాంగమువారు కర్మశాలలంగూర్చి విధించిన చట్టములు. 3. సమష్టివాదుల మతము ప్రకారము కనీస జీతముల నాదేశింపజూచుట. 4. స్వామ్యముంగూర్చిన చట్టదిట్టములు. 5. దాయబాగాది నిర్ణయము, ఇత్యాదులు. వీనిచే నార్జనవిభజనాదులు మార్పులంజెందుట సిద్ధముగాన నివన్నియు భారత నర్థశాస్త్రమునకూం జేరినవియ.

నీతిన్యాయములసంఖ్య యెంతయు దక్కువయయినను వీనియొక్క ప్రభావమెక్కువ. ఉదా. దేశాభిమానము. దీనికన్నమించిన నీతి యరుదు. దానియొక్క యొకానొక ప్రభావ మేమనగా, రాజ్యరక్షణమునకువలయు సామగ్రులన్నియు స్వదేశముననే యుత్పత్తి చేయవలయుననుట. పరరాష్ట్రములనుండి యిట్టి సరకుల దక్కువవెలకు దిగుమతిచేయ వీలుండి