పుట:Bhaarata arthashaastramu (1958).pdf/386

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బల్లపైనుంచినచో నది క్రిందబడదుగదా యందురేమో! నిజమేకాని, ఆ ఱాయి బల్లపైనుండువఱకు నాకర్షణశక్తి నిద్రపోవుచున్నదనుట తప్పు. భూమికి నిరంతర మాకర్షించుచు నుండుటయేపని. కావుననే ఱాయి బల్లపైనదిమి భారము గలదియై యుండుట. ఇట్లే సర్వత్ర ప్రకృతిన్యాయముల క్రమముల శాశ్వతములు. ఎన్నివిధముల కృషిచేసినను పలితము బెంపవచ్చుగాని హీనవృద్ధిని జంపగాదు. ఇందులకు సాక్ష్యము భూమిలోఫలితము సమవృద్ధిగా శ్రమాదులతోడ బెఱుగక తక్కువగా బెఱుగుటయ. కావున ప్రకృతి న్యాయముల క్రమము నిత్యము. రాజశాసనములచే విధింపబడు క్రమములు సర్కారువారి బలము జాగ్రత్తకొలది పదిలములుగాని నిర్బేద్యస్థితులుగావు. మఱియు నాక్రమములను బ్రచారమునకుదేగల కారణవస్తువైన గవర్నమెంటను నొకటి యున్నంగాని యవి న్యాయములనుపేర బరగ నేరవు. మీరును మేమును శాసనములం బ్రకటింప బూనితిమేని నవ్వులుతప్ప నింకెవ్వియు బయలువెడలవుగదా! బలముగల పరిపాలకులచే నిర్వర్తింప బడునుగాన నాక్రమములు సంపూర్ణముగ బ్రచారమునకు రాకపోయినను వచ్చుజాడగలవిగానున్నవి. అందఱు బన్నులుగట్టరేమోకాని ముక్కాలు మువ్వీసముమంది కట్టుదురనుట నిజమేకదా! కావున రాజశాసనములయందు గ్రమము బహుళము.

ఇక నీతియందన్ననో చూడుడు! లోకమున నిత్యసత్యులెవరైన నున్నారా? లేరు. నిత్య సత్యులు లేకున్నను "నిత్యసత్య సంధత్వము న్యాయము" అనుమాట యందఱు నంగీకరించునదియ. కావున నిందు గ్రమము లేకయేయున్నను న్యాయముయొక్క స్థిరత కపాయములేదు. క్రమ మసంభవమైనను న్యాయమేమో నిత్యము.

ఈ నిత్యతకు బ్రకృతిన్యాయ నిత్యతకుంగల భేదమేమి? ప్రకృతి న్యాయము లనుభవములో నిత్యములు. వీనింగూర్చి యోగ్యాయోగ్యతా విమర్శచేయుట తప్పు నీతిన్యాయములు యోగ్యతలో నిత్యములు. అనుభవమున నివి సిద్ధికి వచ్చునో రావో? రాకున్నను జేతనైనంత వఱకు వానికి సిద్ధిగల్పించుట కరణీయము.

ఈ మూడు న్యాయములకుంగల మఱియొక భేదము

రాజశాసనములరీతిం బ్రవర్తింపమేని శాసనముల రద్దుచేయరు. మఱి మనల దండించి శాసనముల ననువర్తింప జేయుదురు. నీతిన్యాయములయందు నిట్లే. జనులలో సత్యములేదని సత్యము న్యాయముగాదని మందలింపము. మఱి సత్యముతో మనము గలసియుండునట్లు వర్తించుట తప్పక యాచరణకు దేవలసిన క్రియయని యాదేశింతుము. అనగా న్యాయమునకు గ్రమమునకును భిన్నత గలిగినయెడల గ్రమము దుష్టమని మార్పజూతుము.

ప్రకృతి న్యాయములరీతివేఱు "ఉష్ణముచేత వస్తువులు విస్తృతములౌను" అను నొక న్యాయము గలదు. ఇందునకు నీళ్ళు పాలు పొంగుట. చీలలు మరలు. ఇట్టివి యెండ కాలమున బిగువు గాంచుట యిత్యాదులు నిదర్శనములు. ఒకవేళ వేడిమిచే విరివిగాంచని కొన్నివస్తువులుండెబో. అట్టివస్తువులును గలవు. పచ్చికొయ్యలకుకాక దాకించిన నవి శుష్కించి సన్నగిల్లును. పై న్యాయమునకు విధేయములుగావని యా పచ్చికొయ్యలను మనం దిట్టము. కొట్టము. చర్యల మార్పవలయునని గురూపదేశము చేయము! మఱి న్యాయములనే