పుట:Bhaarata arthashaastramu (1958).pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంటికడ. మూలకడ. పట్టుపట్టిసాగిన పెఱటింటకడ: కావున నిర్వికారత జడపదార్థముల తక్కువతనముగాని, దైవపురుషులకు నివేదింపదగిన గొప్పతనముగాదు.

మఱియు లోకాచారమెఱుంగరా? ఎట్టిపండితుడైనను బలవంతుడైనను బరిశ్రమ లేకున్న గృశింపక పోవునా! నదు లచలములైన కంపుగుంటలుగావా? అట్లే పరిపూర్ణ భావము ప్రాప్తమైనను బరిశ్ర మములేనిది నిత్యంబగుట దుర్లభము. కావున నిలుకడకును జలనము ప్రధానము! ఈ వింత యెట్లున్నదనగా బొంగరముయొక్క మనోహరమైన యచలస్థితికి గిరగిరమని వేగముగ దిరుగుటయే యాధారమైన మాడ్కి.

శాసనములకు లొంగిపోవుట భయముచేత. ప్రకృతికి లోబడియుండుట విధిలేమిచేత.

మనవారిలో ధర్మశాస్త్రములనబడు వర్ణశాస్త్రములు చట్టములంబోలిన న్యాయములుగాని యుత్కృష్ట మైన తత్త్వమార్గమునకుం జేరినవిగావు. పూర్వకాలమున రాజులచేతను, ఇప్పుడు కులమువారి చేతను బ్రయోగింపబడు శిక్షలును, చిరకాలాభ్యాసము చేత గరుడుగట్టిన వాడుకలును, వీనికి నుద్ధారకములు. ఇంతియేకాని యవి కేవలము సత్యమునకుం జేరిన నీతులుగావు.

3. నీతి. దృష్టాంతము: సత్యము చెప్పవలయునను న్యాయము. ఇచట న్యాయంబనిన ప్రకృతి న్యాయంబుగాదు. సత్యముచెప్పుట విధిలేనిక్రియ గాదనుట స్పష్టము. మఱి రాజశాసనముగాదు. కల్లలాడగూడదనియు, నాడినంత దండ్యులౌదురనియు జట్టము లెక్కడను లేవు. న్యాయంబనగా నిట కర్తవ్యమని యర్థము. అనగా జేయదగినది. ప్రకృతి న్యాయంబుల ప్రకారము తప్పక చేయుదుము. రాజన్యాయము లనుసరణకు దగినవి కాకపోవచ్చును. అనగా నీతిబాహ్యములుగా నుండుటయుం గలదు. అయినను భీతిచే వాని ననుసరింతుము. మీతిన్యాయముల కేరీతిని నడుచుకోవలయు ననుటకు బహిర్నిర్బందములెవ్వియులేవు. చూడుడు! ప్రకృతికి విధేయులమైయుండునట్లు మనల నిర్బంధించునది మనుష్యుల సంకల్పమునకుమీఱిన స్వభావము. ఉదా. కాలుజాఱిన గ్రింద బడుదుము. ఇందు మన యిచ్ఛాశక్తికి నధికారములేదు. అనగా మనము పడరాదనుకొన్నను బడుటతప్పదు. ఇక రాజశాసనములకు విధేయులమైయుండునట్లుచేయు బంధనము దండ పారుష్యము. ఇచ్చట ఇచ్ఛాశక్తికి బ్రవేశమున్నది. అనగా బట్టముల నుల్లంఘింతునని ప్రతిజ్ఞ గొన్న నుల్లంఘించుట కష్టముగాదు. కాకపోయినను గష్టనష్టభయములచే మనస్వాతంత్ర్యము నిరోధింతుము. నీతికి విధేయులమైయుంటకు మన మనస్సాక్ష్యమనబడు సత్యవాత్సల్యముదప్ప నితర నిర్బంధకములు గానరావు. ఇది యంతరంగబంధనము. స్వేచ్ఛాశక్తితో సంబంధముగలది. "సత్యమనుష్ఠింపదగినది. కావున నేను అనుష్ఠింతును" అను సంకల్పములేనివాడు నరుండు సత్యగరిష్ఠుండు కాజాలడు. హరిశ్చంద్ర ప్రవర్తనకు మనల బయటినుండి బలాత్కరించు కారణములు లేవు. కావున నీతి మనుష్య స్వాతంత్ర్యము నకు జేరిన వ్యాపారమని కొందఱు తత్త్వవేత్తలు వచించిరి.

ఈ త్రివిధ న్యాయములకు మఱియొక యంతరము

ప్రకృతిన్యాయము లమోఘములు. ఇవి విధించుక్రమంబులకు విఘ్నములును వికారము లునులేవు. ఉదా. భూమ్యాకర్షణశక్తిచేత నూతలేని వస్తువు క్రిందబడును. ఒక ఱాయిని