పుట:Bhaarata arthashaastramu (1958).pdf/382

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ములను విస్తరింపజేసి సర్వము నాక్రమించునదిగా నొనర్చుటయే మంచినీతి. దానిని గృశింపజేయుట మొదటికే మోసము; అని వాదింతురు. వీరికి సామాన్య సమష్టి వాదులనిపేరు. ఆధునికస్థితి తనంతట సహజముగజెందు పరిణామమే మంచి చికిత్సయనువారు. వీరి మతప్రకారము గవర్న్మెంటువారికి బ్రధానలక్షణము దండనీతి కాదు. మఱేమన్న, వర్తక సంఘములలోని చోదక మండలియట్లు వ్యాపార పారీణులైయుండుట.

ప్రజలే విజృంభించి ఈ సంస్కారముల నెఱవేర్ప వలయుననుట యీ మూడు వర్గముల వారియు సామాన్యమతము. ఇది కొందఱకు నసమ్మతము.

4. ఎట్లన, జనులెల్ల రేగిరేని సంఘమరాజకమై చిందర వందరలౌనని యనేకులు భయపడి "రాజ్యాంగమువారే సాధ్యమైనంత వఱకుం గృతప్రారంభులై యాధునిక స్థితిలోని యకృత్యములమార్చి, చట్టదిట్టములచే నడలుల నుడిపించిరేని, నరులు కష్టదారిద్ర విముక్తులై, యిట్టియాలోచనల పొంతబోక శాంతింతురుగదా! కోపతాపములకు దీనతయే కారణము. దీనత బాయజేసితిమేని నీయుడుకులన్నియు నుపశమించును. చూడుడు! ధనికులైనవారు సంస్కరణంబులేలయని యూరకుందురు. కావున నెల్లరకును భుక్తి బాగుగా జరుగునట్లు పద్ధతులు ప్రకటించిన దొరతనమువారిమీద బ్రజలేల పగగొని దండెత్తుదురు?" అని చెప్పుదురు. ఇట్టివ్యాఖ్యానములం జేయువారిపేరు రాజ్యాంగ సమష్టివాదులు. వీరి ముఖ్యోద్దేశ్య మేమనగా సంతోషమునాపాదించి జనుల కోపాటోపముల సంహరింపం జూచుట. జర్మనీ మొదలగు దేశములలో వీరు కొంతవఱకుం బ్రబలినవారై గణనీయములైన శాసనముల స్థాపించి యున్నారు.

ఈ తెగలయొక్క సిద్ధాంతములను జయసిద్ధులును బ్రస్తావవశమ్మున నచ్చటచ్చట జర్చింపబడును.

సంస్కారచింతల నింతటితోనిలిపి ప్రకృతి మభ్యాసములోనుండు సంశ్లేషముల సవిస్తరముగ వర్ణింప జూతము.