పుట:Bhaarata arthashaastramu (1958).pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దూరమ్మున వ్యాపించి యన్నిటియందును బ్రాకుస్వభావము గలదిగా నున్నది. స్వోపకారబుద్ధి క్షయమును, పరోపకార బుద్ధి వృద్ధిని గనుచున్నవిగాన సంఘపరానురాగం బొకానొకప్పుడు వెన్నతోడ వచ్చిన గుణంబౌట సిద్ధము. పూర్వమట్లు తెగినవారుగాక యానసౌకర్యాది సాధనముల యనుకూలతం జేసి సాంఘికులందఱు కరుడుగట్టిన ట్లేకవస్తు భావముం దాల్చియున్నారు. కావున బ్రత్యేకముగ ఫలము లనుభవింపంగోరుట నానాటికి గృశించు హీనగుణము. దీనికి బ్రత్యామ్నాయ మేమనిన:-

నిశ్చయమే. పరోపకార బుద్ధియు స్వతస్సిద్ధమైయున్నది. అది వికసించి ఎల్లెడల దానయైయుండిన మీప్రసంగములు లేకయె మేమును తేనెటీగలౌదుము. కావున మీబోధ యపకృతము. ఆనాటిమాట యానాటికి. నేటికేల? కాశిలో దొంగిలింప వలయునన్న రామేశ్వరము వద్దనుండి వంగుకొని పోవలయునా? ఈ వాదము లిప్పటికింత చాలును.

సమష్టికి నాయకత్వంబు గుదుర్పవలయు ననువారల వర్గంబు లెవ్వియన?

1. కొందఱు సొత్తులయం దెవ్వరికిని బ్రత్యేకాధికారము లేకుండ సర్వజనసామాన్యముంజేయ నుప దేశింతురు. వీరిమతమేమనగా, సర్వానర్థములకును స్వామ్యమాలవాలము. కావున సంఘమును వేఱులతో బెఱకి మేము కాంక్షించు తీరున నుండు స్థితిలోనాటిన నేయవస్థకుం బాత్రంబుగాక పెఱిగి యయ్యది పుష్పఫలోపేతంబై నిఖిల ప్రజానంద కారియగును. స్వామ్యమును గత్తరింపక యెన్నిదోహదము చేసినను, అంటులు గట్టినను, నిర్దుష్టములైన సుఖంబులు చేకూరవు. సంఘసామాన్యములై యర్థంబులుండెనేని పరోపకారబుద్ధితో మాత్రమందరు బాటువడుదురు. మఱియు దొంగతనము మొదలగు దురుద్యమంబుల కెవ్వండునుబోడు. ప్రత్యేకముగ నాస్తులు పాస్తులుంటచే దురాశలు దౌష్ట్యములు నావిర్భవించినవి. ఇదిలేనిచో సైన్యములేల, పోలీసువా