పుట:Bhaarata arthashaastramu (1958).pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అత్యార్జనము, అనార్జనము నను బాధలకు నియ్యది యాకరము. ఉండనిండు! ఐనను తనదియను నిశ్చయములేకున్న నెవ్వడును బాటుపడడుగదా! పాటు పూజ్యమైన ఫలము పూర్ణానుస్వారమగును. ఇపుడు గొందఱకైన సుభిక్షసిద్ధియున్నది. స్వామ్య విరహిత స్థితియందో దుర్భిక్ష మెల్లరకు సామాన్య మగును. ఈ క్షామ సమత్వము శ్మశాన సమత్వము.

మఱియు స్పర్ధలేనిది వృద్ధి యుండదు. స్పర్ధచే ముప్పులు గలుగక నానవు. నిరంజనత భూలోక వాసులకు నలభ్యము. మీరుగోరు పరిపూర్ణ సుఖసంకీర్ణమైన స్థితి యసాధ్యము. మించిన దానికై వగచుట పామరగుణము. బుద్ధిమంతులు నైజములు ననివార్యములునైన స్థితిగతుల ననుసరించి కూడినంత సౌఖ్యముంగొని యంతటితో దృప్తివహింతురు. లేనిదానిని దెచ్చిపెట్టుమని యేడ్చువారు బాలిశులు. చూడుడు! బలపరాక్రమములు గణ్యములందురు. దీనివలని ప్రయోజనంబేమి? శత్రు భంజనము. "అయ్యో! వారు చచ్చుచున్నారే! వారిభార్య లెట్లలమట బడుదురో" యను పరితాపంబునంజేసి పరమశాంతిపరులమైయున్న నీసుగుణములు ముందునకు రావు. శత్రువులును మనయట్లే యహీన మార్దనపరులైనసరే. లేకున్న మనకుం బ్రాణమానంబులు దక్కవు. అందుచే నాత్మహింసయు సంఘహింసయు జేసినవారమగుదుము. కావున నేమాలిన్యమునులేని మంచిగతులు కావలయుననుట మనసు మెత్తందనముం జూపునదియైనను జ్ఞానశూన్యతయు జూపునదియ. నీడలేని వస్తువులులేనట్లు లోపములులేని పరిపూర్ణత లెట్టిపట్టుబట్టి వెదకినను దొరకవు. దీనికి సమష్టివాదు లిచ్చెడు ప్రత్యుత్తర మేమనగా:-

మనుష్యుడు తనమేలే చూచుకొను కూళమృగముగాదు. పరులయెడ పశ్చాత్తాపము నుపకార ప్రసక్తి యనునివియు వానికి సహజముల, కావున దనకైమాత్రము పాటుపడుననుట తప్పు. ఫలము