పుట:Bhaarata arthashaastramu (1958).pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజ ధర్మములుగా నుండినందున వానిని విధిలేక భయముచే బాటించిన వారమైతిమి. ఇపుడు బ్రిటిష్‌వా రీయాచారములు రాజరక్షకు ననర్హములని దండనీతి బాహ్యములం జేసినందున వానియందలి యాదరము చదువులు కలుములు వెలయు పట్టణ వాసంబులలో పంచ బంగాళమై పాఱిపోవుచున్నది.

అట్లగుట, సమష్టి ప్రచారముల నేరీతి స్థాపింపనగును? రాజ్యాంగ మూలముగనా, సామాన్య సమూహముల చేతనా? యను ప్రశ్నకు గొందఱు ప్రభుమార్గము నవనియు గొందఱు ప్రజామార్గమున ననియు నుత్తర మిచ్చెదరు.

ప్రభుమార్గ సమష్టివాదులు, ప్రజామార్గ సమష్టి వాదులు, అని సమష్టి ప్రచారము లుత్తమము లనెడవారు విభాగింపబడియున్నారు. క్షాత్రవిధిని సామాన్యరీతిని జేయబడిన సంస్కారముల నిదివఱకే వినిపించితిమి. వీనియొక్క యంతరువుల నిర్ణయించుట కిదిగాదుతఱి. అయిన నొక్క విన్నపము. వర్తమానమున సమష్టి ప్రచారము రెండు తెఱగులను నడువ నారంభించినది. ఈ మార్గములు పరస్పర విరుద్ధములు గాకపోవుటచే నట్లు సాగుచున్నది. మఱియు బశ్చిమదేశము లలో బ్రజాప్రతినిధులే పరిపాలకులు గావున బ్రజాప్రభుమార్గము లేకీభావమునకువచ్చు జాడగలవియై యున్నవి. ఈ కారణములచే నవిభిన్నములయ్యు నన్యోన్యమైత్రి గలవియ యని యెఱుంగునది.

ఎట్లును, ఇంతదూరము చెప్పితిమిగాన సమష్టివాదులం గూర్చి యింకను నొక్కింత వక్కాణించి విరమింతము.

ఆధునిక సంఘస్థితిని ఖండించుటలో వీరెల్లరు నేకవాక్యముగా నున్నారు. వీరి మతప్రకార మైరోపాలోని ముఖ్యదోషము లెవ్వియనిన:-

అమితస్పర్ధ - అనిరోధస్వామ్యము

స్వామ్యంబనగా దనసొత్తులయందు దనకుగల సొంతము. ఇయ్యది యాధునికమున నిరాఘాటముగ నున్నదని చెప్పవచ్చును.