పుట:Bhaarata arthashaastramu (1958).pdf/375

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెదకి యందు బట్టంబు గట్టుట తెలివిమాలిన తెఱంగనియు నివేదించెదరు. సమష్టివాదుల యభిప్రాయమువేరు. సంఘ నాయకత్వముం, దాల్చి యార్థిక క్రియల నడిపింప వలసినదనియు, మాత్సర్య స్వాతంత్ర్య విహారముల విశేషించి యుపశమనమ్మునకుం దెచ్చుట యిమ్మనియు దృఢనిశ్చయులైయున్నారు.

ప్రస్తాప వశమ్మున బేర్కొనబడిన యిరుపక్షముల యొక్క లక్షణములు సంగ్రహముగ వివరింతము.

1. సమష్టియనగా మనమెద్దాని యంశభూతులమై యున్నామో యాసమూహము. సమూహములు బహువిధములు. కుటుంబము వర్ణము, రాజ్యము ఇత్యాదులు. ఇందు సర్వసమూహములకును రాజ్యమునకును బ్రకటమైన వ్యత్యాసమొండుగలదు. కుటుంబమున బెద్దలు చెప్పినట్లు వినకపోయిన గలహములు మెండగును. మనస్తాపములు పుట్టును. రాజ్యాంగమువారు శాసించునట్లుండక మీఱి వర్తింతుమేని నొక్క మనస్తాపముతో ముక్తిదొరకదు. అపరాధములు, కారాగార ప్రవాసము ఇత్యాది శరీర తాపములును వదలక వచ్చి చుట్టుముట్టును. ఈ వ్యత్యాసముయొక్క స్వభావము నిర్వచించురీతి యేదన, రాజ్యాంగమువారి యధికారములకు దండనీతి నిదానము, తక్కుంగల సమూహములు దండనీతిం బ్రయోగింప సమర్థములుగావు. మఱి సామాది యితరోపాయములు వారికి నిదానములు . దృష్టాంతము. తండ్రియొక్క వచనంబుల నుల్లంఘించితిమేని నాతడు మొగము చేవురించుకొని, నాడు భోజనము చేయకుండుట, భార్యను గద్దించుట. మనతో మాటాడకుండుట ఇత్యాది దారుణ కార్యమ్ములతో దృప్తిజెందును. పన్నుల జెల్లింప కుందుమేని ప్రభువులు మనసొత్తుల జప్తిచేసి లాగికొని పోదురు. క్షాత్రవిధులచే నుజ్జ్వలములు గావుననే రాజశాసనముల యందు మనకు భక్తియెక్కువ. పూర్వము వర్ణ ధర్మములు సైతము