పుట:Bhaarata arthashaastramu (1958).pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాల్గవ తరగతివారు నియోజ్యులు. అనగా నధీనులై పాటుపడవలసినవారు, సనాథులు.

నిర్మాతల సత్త్వంబు విశదంబుచేయ స్వదేశనిదర్శనంబులు గలవు. చూడుడు! కావేరీ, గోదావరీ, కృష్ణాతీరముల వరిధాన్యపు యంత్రములు స్థాపింపబడుచున్నవిగదా! ఈ విధానముల లాభకరములుగా జేయ వలయునన్న నెంతయోచనతో బ్రారంభింప వలయునో యా నిర్మాతలకేగాని మనకెట్లు తెలియగలదు? "వరియొక్క యుత్పత్తియెంత? మనశాలకు నేమాత్రము సరకువచ్చును? దంచి సిద్ధపఱచిన బియ్యము నేయేస్థలముల నమ్మవచ్చును? వెలల విధము లెట్లు? బర్మాబియ్యమువచ్చి మనబియ్యమును మాయము చేయునా? అట్లుచేసెబో, బర్మావా రిదివఱకు జేరనట్టి సీమలున్నవా? అక్కడి క్రయవిక్రయ ముల స్థితులెట్లు? మనము లాభము చెందుచుంటంజూచి గొఱ్ఱెలమాదిరి మనవారెల్ల నీయంత్రస్థాపనకే గుమిగట్టివత్తురా? రైలులో నొకబండి వాకిలిదెరువగానే యందఱును బెదరిన మెకము లట్లు దానిలో నొక్కుమ్మడిం బ్రవేశింప బ్రయత్నించి తలలు బ్రద్దలుగ జేసికొండ్రుగాదే? అట్లే వారితలలతో మాతలలను బ్రద్దలు సేతురేమో? ఒకవేళ స్పర్ధ యమితమైనది. అపుడీయంత్రముల నమ్మియో మార్చియో మూలధనము మిక్కిలిగా జెడకుండ రక్షించి వేఱువృత్తుల కారంభింపవచ్చునా? మఱియు నమ్మకముతో బనిచేయు గుమాస్తాలు దొరుకుదురా? తప్పులెక్కలుచూపి వృత్రాసురు డింద్రుని మ్రింగవచ్చినట్లు యజమానులచే గ్రుక్కగొనజూతురా! ఇట్లనేకవిధముల వరివ్యాపారమంతయు త్రిప్పించి మళ్ళించిచూచి మఱి పూనినంగాని యపకారము రాకపోదు.

వ్యవహారచక్రము నడిపించువా రెవరనగా బుద్ధిబలముగల నిర్మాతలనుట స్పష్టము. ఆర్థిక ప్రపంచము నంతయు బొమ్మలవలె