పుట:Bhaarata arthashaastramu (1958).pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాణెము

యోగ్యత కుశలత సంయోగించిన నాణెమేర్పడును. నాణెము గలవానికి నిధు లుల్లసిల్లు నీదినంబులలో మూలధనము లభించుట దుర్ఘటంబుగాదు. సొమ్ము నమ్మదగిన వారికియ్యక సంచులలో గట్టియుంచుట కెవ్వడును సమ్మతింపడు. కావున వ్యవహార నిర్మాతలకు ముఖ్యముగా నుండవలసిన లక్షణములు రెండ. బుద్ధికౌశల్యము, సుశీలము, ఈ రెండు సంపదలున్న దక్కినవి యనాయాసముగ వచ్చి చేరురు. బ్యాంకు మేనేజరులు వ్యవహారసమర్ధులుగాన వారినివంచించుట దుష్కరము. వారినామోదింప జేయు చాతుర్యమున్న మూలధనప్రాప్తికి గొదువరాదు.

చూచితిరా యీ విశేషము? నాణ్యము, విశ్వాసము, నడవడి, యొప్పిదము, భావ గాంభీర్యము ఇత్యాది సుగుణము లర్థవిన్యాసమునకుం బ్రధాన నిదానములు. ఇక "నర్థోపార్జనము దుశ్చరిత్రముల కెల్ల బుట్టినిల్లు" అనువారి బుద్ధివైశద్యము నేమని వర్ణింతము?

ఏవ్యవహారమైనను ముందు వెన్కలుచూచి స్థాపించి కొన్నిదినములు తామే నడిపించి యదియొక క్రమమునకు వచ్చినతోడనే నిపుణులైనవారలం గార్యదర్శులుగ నియమించి యా నిర్మాతలు పైవిచారణమాత్రము చూచుకొనుచుందురు. అమెరికాలో 'పియర్ పాంట్ మార్గన్‌' అను కోటీశ్వరు డొకడున్నాడు. వీడు వందల కొలది వ్యాపారముల సృష్టిజేసి వానికెల్ల చోదకుడై యుండెడిని. ఇట్లుండియు నా యా శాలలకు దాను తఱుచు పోవుటలేదు. ఆవేశనములనుండి పనిదీయించుట వానిముక్త్యారులపని. ఇక దానేమి చేయుననగా తనకచ్చేరీగదిలోగూర్చుండి లోకములోని యావద్వర్త మానములను తంతి, తపాల్, పత్రికలు, తననౌకరులుపంపిన పత్రములు, వీనిమూలకముగనారసి యెయ్యైవిధంబుల నాజ్ఞలియ్య వలయునో యని యోచించి సర్వమునకు సూత్రధారుడై యుండును. ఏవైనదేశములు