పుట:Bhaarata arthashaastramu (1958).pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంగతి. మఱియు, ఫ్యాక్టరీలు మన జిల్లాలలోని కస్పాపట్టణములంత పెద్దగ నున్నవనియు, కొందఱది కారణమ్ముగ వేఱుపట్టనముల గట్టించియున్నారనియు నంటిమిగదా! యజమానుడైన వాడీసేవక మండలినంతయుసాధించి సక్రమవర్తులం జేయజాలినంత ప్రభావోపేతుడై యున్నంగాని యొక్కనాటిలో సర్వము ధ్వంసంబగును. ధనమున్న మాత్రమున నీతేజంబు గలుగునా? బహుశ: కలుగదు. దేశ దేశములు వ్యవహార విషయమున మిళితములై యున్నవిగాన, నొక్కెడ నుత్పాతములు పుట్టిన దాని దెబ్బ యన్నిచోట్లకుందగులును. ఇందునకు దృష్టాంతములు:-

ఇంగ్లాండులో 'మాన్‌చెష్టర్‌' అను వణ్యపట్టణము వారు కోట్లకొలది రూపాయలు విలువగల వస్త్రముల ననువయించి మనకంపుట తెలిసిన విషయమ, మనకీమాత్రము సెలవు కావలసియుండునని మదింపు వేసి యా మదింపుననుసరించి వస్తువుల రచన కుపక్రమింప వలయుననుట సర్వవ్యావహారికులును బాటింపవలసినపద్ధతి. ఈమదింపువేయుట సామాన్యమగుపనియా యోచింపుడు! 1. వానలు తేలిపోయి పంటలు పాడువడిన దేశములోని ప్రజలకు భోజనపు సెలవులు, అధికములుగాన నట్టి క్షామకాలమున వస్త్రములకు గిరాకిమట్టు. 2. "స్వదేశవస్తువులనే కొనవలయు, విదేశవస్తువులు భ్రష్టములు, ముట్టరానివి" యని కంకణము గట్టుకొనియున్నవారిసంఖ్య యేమాత్ర మనియు, వారి మాటలరీతినే చేతులున్నవాయనియు యోచింపవలయు. మఱియు, స్వదేశప్రతిజ్ఞ లెన్నియున్ననేమి? ఇచటవారే పరదేశపు సరకులగొని స్వదేశపుపేర ముద్రలువేసి మోసగించి యమ్మువారుండక పోయెదరా? ఇట్టివారెవ్వరు? ఎంతమంది? యనియు గనుగొనవలయు. 3. మనదేశమునకు జర్మనీవారు, జపాన్‌వారును, సరకుల నెగుమతి సేతురుగాన నాదేశములలో నా యా సంవత్సరములలో వెలయబోవు వెలలు, రాసులు, సరకుల గుణములు నరసి,