పుట:Bhaarata arthashaastramu (1958).pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఖండమువారు కాలక్రమమ్మున నభివృద్ధినొందుడు, ఉత్పత్తి వినిమయములు రెండును వెలయందొడంగె. రక్షకసంపద, రాకపోకలు, చదువులు, నతిశయించు కొలది జనులు మూఢభక్తి వదల్చుకొన్నవారై దూరపు వ్యవహారముల కారంభించి ప్రత్యక్షమైన గిరాకినే గాక, పరోక్షంబు నాశించియు వస్తువుల రచియింపంబూని, తద్రచనా సామర్థ్యంబు సమగ్రత నొందుటకై యంత్రస్థాపనలు, శ్రమవిశ్లేషము, రొక్కమునకుం గాక నాణెము మీదనిచ్చితీయుట, ఇత్యాది ఘనతర తంత్రంబులకుందొడంగి సామాన్య జనులకు నివ్వెఱపాటు గలుగుమాడ్కి ఆర్థిక చక్రంబు విన్యసించి తిరుగు నట్లొనరించి కృతార్థులు నుజ్వలులునునైరి.

ఈ వ్యాప్తిచేనైన మాఱుపాటు లెవ్వియనిన?

1. పూర్వము వివరింపబడినట్లు, ఉత్పత్తిపరులకును వినియోగ పరులకును మధ్యవర్తులైన వర్తకు లేర్పడుట.

2. తొలుత నీవర్తకులే మూలధనముగల వారుగాన యజమానులట్లు శిల్పులకు నుత్తరువులిచ్చి వలయు వస్తువుల నుత్పత్తి చేయించుకొనుచుండిరి. కాని వ్యాప్తి యింకను నెగయుడు నీయుత్పత్తియు వ్యాపారమును వేఱుపడి ప్రత్యేక కర్తల యధీనముంజెందె.

3. ఈ ప్రత్యేక కర్తలెల్లరు మూలధనో పేతులగుట మూలధన ముండువారెల్ల యజమానులై యుండుట సహజకృత్యమో యనునట్లు శాస్త్రజ్ఞులకు సైతము దోచెగాని, యాధునిక వృత్తాంతము లంబట్టి చూడ యజమానతకు మూలధనం బావశ్యకంబనుట యప్రతిహత న్యాయముగాదు. ఎట్లన;

4. ఇంగ్లాండు, అమెరికా, ఇత్యాది దేశముల వ్యవహార పారీణతం జూడుడు. వారి వాణిజ్యము లోకమంతట నిండియున్నది. దీనికి దీటైన యుత్పత్తియు నున్నదనుట చెప్పకయ గ్రహించు కొనదగిన