పుట:Bhaarata arthashaastramu (1958).pdf/35

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మిగుల గొప్పదశయనియు, మోక్షసాధనమున కెత్తిన యుపకరణమనియు బ్రసంగింపబూనిరి. 'తనకు నందని ద్రాక్షపండ్లు పుల్లనివి' యని నక్క యనుకొన్న ప్రకారము ధనము నీషణమనియు దదార్జనమునకై శ్రమపడుట యనంతములగు దు:ఖములకును, పాపములకును గారణమనియు నట్లగుట నది వర్జనీయమనియు వాక్రుచ్చిరి. ఈసిద్ధాంతములలో నొకింతయైన నిజము లేదనుటకు వారి వర్తనమును శాస్త్రములునే ప్రబలప్రమాణముగ నున్నవి. అదియెట్లనిన:-

దానము పుణ్యకర్మలలో నెల్ల నెత్తినదిగా వర్ణింపబడినదిగదా? బ్రాహ్మణులకు భూరిదక్షిణలొసగి తృప్తులగావించిన (ఇది యెవరిచేనైన నగునా !) తప్పక స్వర్గసిద్ధి యగునట ! అవునుగాని భూరియే లేనిది భూరిదక్షిణలెట్లు ! వనప్రతిష్ఠ, దేవాలయములు గట్టించుట, పెండ్లిలేనివారికి బెండ్లిచేయించుట, పెండ్లియైనవారికి శాంతి ప్రస్తుతం గావించుట మొదలగు ధర్మకార్యముల కన్నిటికిని ధనములేకున్న సాగదుగదా ! కావున ధనార్జనంబు కూడదగుట మూడమతంబు. మఱియు సన్యాసము నవలంబించుట చాల గొప్పకార్యమందురే. సన్యసించుటయననేమి ? తనకుగల సమస్త పదార్ధములను విసర్జించుట యని యర్థముగదా ! ఏవస్తువులేకున్న దేనిని విసర్జింపనగును ? ఎట్లు చూచినను అర్థార్జనం బవశ్యకర్తవ్యంబు

ఐరోపాదేశీయులింత ప్రబలస్థిలో నుండుటకు వారి దుర్గుణములు దౌష్ట్యమును గారణములని తెలిసి తెలియనివా రనుకొనెదరు. ఇదియెంతమాత్రము నమ్మదగిన యూహకాదు. వారిఘనతకు వారి సుగుణములే కారణములు. ఎట్లన్న మనదేశములో నంగడికిబోయి వస్తువులు కొనవలయునన్నచో నరగంటసేపు బేరమాడవలసివుండును. ఇందుచే గాలయాపన మగుటయేకాక నమ్మకము జెడుచున్నది. ఇంగ్లీషువారి షాపులలో నెవరుపోయినను నికరమైన వెలయొకటే. కావున వారిలో కొనుట అమ్ముటయన బహుత్వరలో జరుగును.