పుట:Bhaarata arthashaastramu (1958).pdf/348

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. అధశ్చరములు. ఇండ్లయొక్క యస్తిభారములకు నేమాత్రం నపాయము లేకుండునట్లు మిక్కిలి లోతుగాద్రవ్వి భూమిలో వివరము గావించి, యావివరములో నినుపదారులువేసి వానిమీద నడిపింప బడునవి. అక్కడక్కడ విద్యుచ్ఛక్తి వెలుతురుచే దేదీప్యమానము లైన స్టేషనులుండును. దిగువారు పైనికి బోయి వీధి జేరుటకు ననుకూలములగు నుద్వహనయంత్రము లున్నవి. ఈయంత్రములే పైనుండు వారిని క్రిందికి దింపును.

శీఘ్రగమన యంత్రములే యాశ్చర్యకరములుగానుండ నింకను నాశ్వర్యకరమైన క్రమమొండు గూడగలదు! ఈ రథములన్నియు నుద్వహన యంత్రములట్లు అనతివేగాతి వేగములని రెండువిధములు. మన దేశములో రైలుబండ్లు టపాల్‌ట్రెయిన్ సాధాట్రెయిన్ అని యుండలేదా? ఆ రీతినే యవియునని గ్రహించునది. అతివేగములు కొన్నియెడలమాత్ర మాపబడును. చూడుడు! కాలమునందు పాశ్చాత్యుల కెంతదృష్టియున్నదో! మనదేశపు రివాజువేఱు. రాహు కాలమని, పగలుకాలమని, నక్షత్రము బాగుగ లేదని, వారశూలయని, పిల్లివచ్చెననియు, బల్లిచచ్చె ననియు బుంఖానుపుంఖములైన వ్యాజముల శరణుజొచ్చి సోమరి తనమును సమస్త శుశ్రూషలజేయుచు నుపాసించుటయ పరమధర్మంబని యున్నామే? తమోగుణము మనకు నాస్థానముగదా? దారిద్రదేవతకు దమోగుణము సింహాసనము. మన మాయాసనమును బదిలముగ స్థాపించియున్నాముగాన నాయమ్మ దిట్టముగ గదలనని మనదేశమున గూర్చొనియున్నది!

5. సాధన సమర్థత. ప్రతివాడును నొక సాధనముమాత్ర ముపయోగించిన విరామములేక దానిని వాడవచ్చును గాన దానినుండి యెంత పనిదీయవచ్చునో యంతపనిని బూర్ణముగ దీయగలడు. బహుకార్యపరులమైనచో కార్యముల మార్చువేళల నయ్యైకార్యముల కనుగుణములైన పరికరముల బూనవలసినచ్చుటంజేసి తదితరపరికరము