పుట:Bhaarata arthashaastramu (1958).pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వృద్ధి పాలితంబులగు మార్గంబుల విహరించి నేత్రోత్సవంబుగావింపదు గాన వీని శృంగారము ధనికులకే గాని నిర్ధనులకంత చక్కగా గోచరంబుగాదు.

శ్రమ విశ్లేషమువలని లాభములు

1. క్రియల భాగింప భాగింప బహుసులభముగ యోచనసైతములేకయే చేయబడునంత సరళమైన కార్యసముదాయంబుగ నేర్పడును. వీనిని నేర్చికొనుట యనాయాస కృత్యము. తుదకు నీసాధానమునకు జడములైన యంత్రములైనం జాలును.

2. ఇట్లేర్పడిన భాగములు నైపుణి విషయములైన తారతమ్యములను గలిగియుండుట స్వాభావికమ. ఇందు గొన్ని సుకరములు. కొన్ని దుష్కరములు. ఒకయెడ బుద్ధి బలమెక్కువగను, ఇంకొకయెడ బాహుబల మెక్కువగును గావలసివచ్చును. కావున యజమానులైన వారు ప్రయాస వృధగాకుండు నట్లు ఆ యా క్రియలయందు వానికి దగినవారి నియోగింతురు. ఇందుచే ఫలాభివృద్ధి సిద్ధము.

ఒక్కడే కీడనక మేలనక యన్నిటికిం దొడంగిన నష్టమెట్లు తప్పును? చక్కగా నేయనేర్చిన సాలెవాడు నేతపనిలోనే యుండిన మంచిది. అట్లుగాక కొంతసేపుండి పిదప పోగులు చక్కగా నున్నవా యని చూచుటకువెళ్ళి, తరువాత రంగులు పట్టించు పనులలో కొంతసేపుండి, ఇట్లు నానావిధముల దృష్టి సెదరనిచ్చిన కాలకర్మంబులు రెండును ధ్వంసములౌను. యోచనాపరుడు మానసిక క్రియలందే యవికలస్వాంతుడైవున్న విషయశోధనంబు సుఘటంబు. మన ఇండ్లలో బలె బిడ్డల నోదార్చుట, బిచ్చగాండ్రతో వాదించుట, ఇత్యాది కార్యములగూడ జూచికొనవలయునన్న తలంపులు కొనసాగవు. తపసునందెట్లో వ్యవహారములందునట్లే. అనగా నేకాగ్రత అమోఘం.

కష్టముకొలది పనులను రకములు రకములుగ జేసిపెట్టుటలో నింకను నొకగుణమున్నది. ఏదన దుర్బలులైనవారింగూడ వారి కను