పుట:Bhaarata arthashaastramu (1958).pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విస్తరత గాంచినంగాని మామిడితోటల సామ్యము చేజూపినట్లు శ్రమవిశ్లేష మిక్కిలిగా గొనసాగనేరదు. కావున వాణిజ్యచక్రము శ్రమ విభజనమును పరస్పరాను కూలములు. మఱియు వృత్తులు భిన్నములు గాక యెల్లరును తమకుం గావలసినవన్నియు దామే యార్జించు చుండిన వర్తకములుండవనియు జెప్పియున్నాము. ఇవి యెట్లు కలసిమెలసి పిరిగొనియున్నవో చూడుడు!

మఱియు నుత్పత్తి యనుకూలించెబో, వస్తువుల గుణంబులు ననుకూలించినంగాని ప్రయాసను పాలుపెట్టుటకుగాదు.

1. రచనక్రియలు వెవ్వేఱుగా జేయుటకు ననువైనివిగా నుండవలయు.

2. కర్మకరులకు నిండినట్లు నియతకాలంబెల్ల వచ్చునంత పనులుండవలయు.

3. కర్మములు పర్యవసితములుగానిభంగి నొకటితో నొకటి యొరసి యేకధారగా నుండవలయు.

ఈ సమయంబులు విరచనక్రియలందంత సాంద్రముగ బంటపనులయందు జెల్లవు.

ఈ విషయములు మఱచియుందురేని నామామిడితోటకు మఱలంబోయి తపసుజేసిన నర్థము ప్రత్యక్షంబగును.

కృషులయందును, ఇంకొకచందాన విశ్లేషణము గలుగవచ్చును. కలుగుచున్నది. అదేదన, వెవ్వేఱు పంటలం నుత్పత్తిచేయుట, ఉద్యానవనకృషిచేయువారును బండ్లతోటలు వేయువారును నేవైన కొన్ని రకములం బోషింపజూతురేకాని కన్నులకు చెవులకు సోకిన ఫలవృక్షంబుల నన్నింటిని గజిబిజిగా గలిపినాటరు.

శ్రమవిశ్లేషము దానికి దోబుట్టువులైన యంత్రములమాడ్కి అధికవృద్ధి న్యాయపాలితంబులైన వ్యవహారములయందుబలె హీన