పుట:Bhaarata arthashaastramu (1958).pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజ్యము చెంగని రాజ్యము రెండుమాత్రమే యున్నవనియు, అందొక్కటి కచ్చావస్తువులను ఇంకొక్కటి పక్కా వస్తువుల సుద్ధపఱచి వ్యాపారముచే గోరికల బూరించుకొనుననియు ననుకొందము. గ్రహములు దారిదప్పి వక్రించినందున వారికేదో కారణముండియో లేకయో యుద్ధము నడిచిన విరచితములు (అనగా వస్త్రాదులు) చాలక అరచితములు (అనగా ధాన్యాదులు) గలరాజ్యమును, అరచితములు చాలక విరచితములుగల రాజ్యమును కత్తులు కటారుల కాంతులు ప్రాకక మున్న దీనతగనును.

దీనికి బదులు గొందఱనున దేమనగా, అట్టిస్థితిలో రంగడు చెంగడును యుద్ధోన్ముఖు లెన్నటికిని గారుకావున భూలోకము రణ తీవ్రతలేక చల్లపడి యెల్లప్పుడును మలయ మారుతములు వీచుచుండు నట్లుండును; కావున దేశములు, ఉత్పత్తివిశ్లేషించి వాణిజ్యముచే సంశ్లేషించెనేని, శాంతి శివలింగమువలె స్థిరముగ నిలుచునుగాన లోకము సర్వ మంగళాకరమై యుండుననుట యంధునకైన విశదంగదా!

దీనికి ప్రత్యాఖ్యానము. ఏకరాజ్యములోని పట్టణ జనమ్ములలొ బలె సంపూర్ణ విశ్లేషము మీయుత్ప్రేక్షలోని రంగచెంగ రాజ్యములలో నున్నదనుకొనినట్లు ఎక్కడను గానిపింపదు. కానిపింపనుబోదు. ఉత్ప్రేక్షలు గట్టివనినమ్మి వాదములకుం జొచ్చుట బుడ్డనునమ్మి ఏటిలో దుమికినట్లు. సంపూర్ణ విశ్లేష యుండుటయేగాదు, వారు మార్చుకొను వస్తువులును, సమానావశ్యకత గలిగినవిగా నుండినం గాని యేల యుద్ధమునకు బోగూడదు? మీయుపమానము సైతము లోపములేనిదిగాదు అరచితములు గలిగినవారు కొన్నినాళ్ళు విరచితములగు వస్త్రభూషణాదులులేకున్న నోర్తునుగాని, విరచిత కళా వ్యాపారులు ధాన్యములులేకున్న నోర్చుటెట్లు? వస్త్రాదులతో గడువును గప్పవచ్చుగాని నించవచ్చునా? కావున వారు నమ్రతతో చేతులు జోడించి రావలసినదేగదా! లోకములో రాజ్యము లుత్పాద