పుట:Bhaarata arthashaastramu (1958).pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జ్యముచే బయటిజిల్లాలనుండి, వడ్లురాగులు మొదలగునవి తెప్పించుకొని సుఖముగనున్నారు. జిల్లాలవారును మిగిలినవానిని వారికమ్మి కొఱతవడిన వానింగొని పూర్ణ మనోరథులయ్యెదరు. కావున మునుపటియట్లు ప్రతిసీమయు సమగ్రగతిం జెందజూచుట యీ కాలమునకు వ్యతిరేకమైన మతము. దేశమునందు విశ్లేషణయున్న వృద్ధియేగాని క్షయములేదు. గొప్పపణ్యస్థానములైన బొంబాయి, కలకత్తా, మదరాసు, ప్రభృతి పురంబులు, ఆహారపదార్థములకై గ్రామజనపదంబులను నమ్మియున్నవి.

రాకపోకలు, వృత్తివిభేదము, శ్రమవిశ్లేషణము. ఇవన్నియు దేశముననుండు సీమలను, సీమవారిని అన్యోన్యాశ్రయులుగాజేసి జిగిబిగియల్లికగానల్లి ఐకమత్యము వృద్ధిజేయునవి. అనగా వెఱ్ఱిముదిఱి జాతిభేదములను నిరోధకనియమములకు జనులు పాల్పడకుండిన యెడల నను వ్యవస్థగుప్తము. చెన్నపురిలేకున్న తళుకులు, బెళుకులు, విద్దెలు, వితరణలు నశించి నాగరకత చెడినవార మగుదుము. కృషికళాశోభితములగు గ్రామాదులు మాయ మైనచో చెన్నపురి వారికి లంబోదరములు తడవిచూచినను చేజిక్కనంత కృశములౌను.

దేశములోని సీమలయందెట్లో, ప్రపంచములోని దేశదేశములును అట్లే. ఏవైన కొన్ని కెలసములకు మాత్రము పూనుకొని విదేశ వాణిజ్యమే శరణమనియున్న మేలని కొందఱనెదురుగాని యది సర్వ సమ్మతమైన యభిప్రాయంబుగాదు. ఎట్లన చెన్నపురియు రాజధానియు విశ్లేషించినవయ్యును, ఏకదేశభాగంబులగుట నవి యొండొంటిపై సమర సంరంభమునకుం దొడంగుననుట యవివేకపు దలంపు. ఇట్లే బంగాళా, పంజాబు మొదలైన స్థలములవారును మనమును నేకమాత్రు సంతానమట్లు సౌహార్దముతో యావత్కాలమును మెలంగు వారమనుట సత్యవ్యత్యస్తము గాదుకాబోలు. ఇట్లు సహజసంయోగం లేనిచో నార్థిక విశ్లేష మపాయకరంబు. ఎట్లన లోకమున రంగని