పుట:Bhaarata arthashaastramu (1958).pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బడినతోడనే మనుస్మృతి నెగుమతిజేయుటయేల? వారాసించు నిబంధనలకు మన పురాకృత సమయాచారములకును 'అమృతము', 'విషము' అను పదంబులు రెండును నీటిని బోధించినను నయ్యవి యెట్లు సమములుగావో, అట్లే వాసి యిసుమంతయులేదు. ఎట్లన:-

పాశ్చాత్యుల ప్రయత్నము హిందువుల దుస్థ్సితి
1. ఉద్దేశము. సంఘముయొక్క ప్రతియంగం యొక్కయు సుఖమును దేజంబును. అనగా జనసామాన్యముయొక్క యభ్యుదయము. 1. హిందువుల యపౌరుషేయాచారములు "కాకులనుగొట్టి గ్రద్దలకువేసె" నన్నట్లు ప్రజలందఱం బీడించి యల్పసంఖ్యులైన శ్రేష్ఠకులులకు ననువుగా సర్వంసేకూర్చుట. కొన్ని యంగములకై శరీరమును బాడుజేసినట్లు.
2. ఉద్దేశము నెఱవేర్చు మార్గము. కర్తృకరణ సంఘంబులు ప్రజాప్రతినిధులు గలిసి యోచించి వ్యవస్థల విధించుట. అనగా సమష్టి రాజకముద్వారా యనిభావము. సమష్టి రాజకమన సర్వజనులు గలిసి ప్రతినిధులచే నడుపు పాలనము. కాలానుగుణముగ మార్పులం జెంద జేయుట. 2. చెదలుతిని మిగిలిన తాటాకులకట్టలతో నెత్తిమీద మోదుట. అనగా ప్రాచీనుల వాక్యములని యెన్నబడువానిలో నాచారములకు నాభారముగా వ్యాఖ్యానముచేయ శక్యమైనవానిని మాత్రము ప్రమాణములని యాదరించుట. ఈ రాజకమున కేమి పేరు పెట్టుదుము: పితృరాజక మనియా? తాటాకుల రాజకమనియా? భూతరాజకమనియా? సనాతనములని శాశ్వత ధర్మంబులని మార్పులేలేక నిలుపజూచుట.
3. స్వతంత్రత. స్వతంత్రతలోని యమితమునుమాత్ర మాపజూతురుగాని బొత్తిగా దీసివేయ గంకణము గట్టుకొన్నవా రెవరునులేరు. 3. స్వతంత్రత.ఏకతంత్రత ఇత్యాదులగు నేవర్తమాన తంత్రంబులును వీరికి సరిపడవు. వీరిమతము భూత తంత్రము. అనగా గతకాలముచే బొమ్మలవలె నాడింపబడుట.

జాగ్రత్త:- యూరోపియను లీక్రమము స్థాపించుమార్గము నింకను నన్వేషించుచున్నారు. మన నియమములట్లు వారిలో నది యాగతమైన విశేషంబు గాదు ఉద్దేశమున్నది గాని విధానములు పరిశోధన పాత్రములు. స్థిరీకృతములుగావు.

కావున మనుస్మృతికై యూరోపియనులు వాసిపోవుచున్నారనుట మూఢభావమే గాని ప్రౌఢభావముగాదు. నామసాదృశ్యముచే వస్తుసాదృశ్యము ననుమానించుట వివేకదూరము.