పుట:Bhaarata arthashaastramu (1958).pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏదన, ధనలుబ్ధుడై యితడిట్టికార్యము లాచరించెననుట సత్యమునకు జాలదూరము!

మఱెందువలన ననిన; రాజసభావముచే ఈవ్యాపార ప్రపంచమునం దనకు మించినవారును సములును నుండగూడదని వారికి క్షాత్రము. తనప్రసాదంబునంగాని లోకమ్మున జీకటి విఱియ గూడనిదై యుండవలయునను మహాభిమాన శోభితుడు. ఇహలోక చంద్రముడను బిరుదునాసించినాడో, లేక జనులందఱు దన్ను దలంచి సాయంకాలమున "దీపంజ్యోతి: పరంబ్రహ్మ కిరోసెన్‌నూనె మండితమ్" అని యెల్లరు తన్నుద్దేశించి సంధ్యావందనముం జేయవలయునని తాత్పర్యమో! ఏదైననేమి? రాజసలాభముగాని తామస లోభముగాదు. తాను కోట్లకొలంది నార్జించినాడు. అర్జనకు ననుగుణములైన దానధర్మములను పాత్రములనెఱింగి యథేష్టముగ లోకంబు వితాకువడు వడువున జేసినాడు. చేయుచున్నాడు. చేయనున్నాడు. 'చికాగో' మహానగరమున సర్వకళాశాలకు నితడిచ్చినది సుమారు ఏడుకోట్లు! చీనాదేశమున విద్యాభివృద్ధికై యిచ్చినది యఱకోటి. 'నీగ్రోలు' అనబడుచు, మాలమాదిగలట్లు నికృష్టులుగ జూడబడి యమెరికావారిచే హింసింపబడు ననాధుల నుద్ధరించుటకు నిచ్చినది యొకకోటి. ఇట్లు జాతిమతాది భేదములులేక దిక్కులు పిక్కటిల్లజేయు దానకళలచే యశోభరితుడైనవానిని లోభియనుట తక్కువపలుకుగాదా? పూర్వము మనరాజులు దిగ్విజయము జేసినట్లు తానును వ్యవహార విషయమైన దిగ్విజయము నొనరించి పట్టభద్రుడైనాడు!

అమెరికా, జర్మనీ, దేశములలో స్పర్ధ యమితమగుటచే బాధితులైన వ్యవహారకర్తలు పరస్పరం కలసియుండినమేలని యిపుడు మహాసంఘములుగా నేర్పడి వైరము లేనివృత్తుల జరుపుటకు మొదలిడి