పుట:Bhaarata arthashaastramu (1958).pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. స్పర్ధ యుత్పత్తికి నుద్దీపకము. ఒకరికన్న ముందుగ నింకొకరు వ్యాపారచక్ర మాక్రమించుకొను నుత్సాహంబుం గలిగిన వారైన నుత్పత్తి వాణిజ్యములీపోటీచే దఱుచులగును.

ఆక్షేపణ ఇది నిజమేగాని స్పర్ధ యమితమైన నయముగ విక్రయించి వ్యాపార మాకర్షించుటకన్న కర్తవ్యములేదని, ఆసాములు చూచుటకు దళుకుగాను చూడంబోయిన బెఱికిగాను, ఉండునురువుల త్వరత్వరగ దయారుచేసి, యుత్పత్తి రాశిలో నధికమైనను మేల్మిలో బీడువడునట్లు చేయుటచే, సరసమనినమ్మి కొనువారికిం దుదకు విరసత గల్పింతురు. ఇది మోసము. అల్పమూల్యములైన విదేశపు సరకుల (ముఖ్యముగ జర్మనీ సరకుల) గొనువారికిది యనుభవవేద్యము.

అనేకులున్నగదా స్పర్ధ! అనేకులులేక యొక వ్యాపారమునకెల్ల నొకడే యీశ్వరుడై యున్న సరకుల గుణముతో వెలలుతగ్గించి తన యమ్మకముం జెడగొట్టుకొనునక్కఱలేదుగాన నట్టి యద్వితీయ పదార్థముల శ్రేష్ఠతను భద్రముగ గాపాడును. నిర్మాత్సర్య వ్యవహారముల ధరలు సరకులు రెండును గొప్పగనుండును. కావున మొత్తముమీద నిదియే సరసకార్యము.

2. స్పర్ధ వినియోగమునకుం దగినంత యుత్పత్తి నాపాదించి రెంటికిని సామ్యముంగూర్చి వ్యర్థత గలుగకుండునటుల జేయును. ఎట్లన:- ఒకయూరిలో పెండ్లికార్యములు ప్రబలి కుండ లెక్కువ గావలసెననుకొనుడు. కుమ్మరి వృత్తిలో నితరులకుం బ్రవేశమున్న వినియోగవిస్ఫారతకుం దీటుగ భాండ విస్తరమును గల్పించుటకు మఱికొంద ఱుద్యోగింతురు. అదిలేనిచో స్పర్థాతీతుడైన పురాణ కుంభకారు డేమిపెట్టిన నదియే ప్రసాదమని కోరికలు తీరకున్నను తృప్తివహించి యుండవలయుగదా!

ఆక్షేపణ. వినియోగముతో నుత్పత్తియు యధాక్రమముగ వృద్ధినొందిన నందఱకును సుఖమే. కీడెవ్వరికినిలేదు. కాని వినియోగ