పుట:Bhaarata arthashaastramu (1958).pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జేరి నివసించుటకును వర్ణభాషాది భేదములు భంగకరములు. ఇంగ్లాండు, రష్యా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్‌స్ మొదలైన పశ్చిమ దేశములలో వెవ్వేఱుమతము లింతయెక్కువగలేకున్నను, వారిమతములలో విదేశయాత్ర నిషేధింపబడకున్నను, వెవ్వేఱు భాషలు ప్రవర్తిల్లునుగాన జీవనోపాయార్ధముగ నొకదేశమువా రింకొకదేశమునకు యధేష్టముగ బోవుట దుర్భరము. అట్లనుటచే బొత్తిగ బోరనుటకాదు. స్వదేశము నంబలె సంచారము సులభము గాదనుట.

ఇంగ్లాండులో ప్రతిసంవత్సరము వేనవేలు జనులు ఐరోపా ఖండమునుండి యుదరపోషణంబుకొఱకు వచ్చెదరు. నూతనముగ నైదువందల హాయనంబులకుం బూర్వము కనిపెట్టంబడిన యమెరికా ఖండము ఐరోపానుండి వెల్లివిఱిసివచ్చెడు జనంబులచే నిండింపబడుచున్నదిగాన నచ్చట బాశ్చాత్యభాష లన్నియుం బ్రవర్తిల్లుటంజేసి నేటికిని ఒక్కొక్క యేడునకు సుమారు సరాసరి పది పదునైదు లక్షల శ్వేతముఖు లందుం జేరెదరు. పరదేశీయులస్పర్ధ యమెరికాకుం దగిలినట్లు, ఇక నేదేశమునకుం తగులబోదు ఆచార పిశాచ గ్రస్తులైన మన హిందువులుగూడ నిపుడు కూలికై దేశదేశమ్ములం ద్రిమ్మర నారంభించి, అమెరికా, కనడా, పనామా, సింగపూర్, చీనా, మలాకా, దక్షిణాఫ్రికా ఇత్యాది సీమలలో పనిపాటులకుం గుదిరియున్నారు. పై వివరించిన విషయములన్నియు బీదలను అల్ప విద్యగలవారునైన కూలివాండ్రం గూర్చినవని యెఱుంగునది.

మూలధన స్పర్ధ

కర్మకరులీరీతి సంచార సరళత లేనివారైనను మూలధన మాచందంబునందక విచ్చలవిడి వాయువేగ మనోవేగంబుల భూచక్ర ప్రదక్షిణము జేయుటలో నద్భుత సామర్థ్యముగలది. కోలారులో గనుల దింపుటకుబట్టు ధనరాసులు, ఇంగ్లాండునుండి యొకనిముసమున బ్రవాహముగదిగును. చీనాదేశమున బొగ్గుగనులం బుటభేదన