పుట:Bhaarata arthashaastramu (1958).pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లనియు వేఱుగజెప్పనేల? స్వతంత్రతయు స్పర్ధయు నేకవద్భూతములు. ఇవిలేనిచో గొఱ్ఱెలవలె దలవంచుకొని గ్రుడ్డిమార్గములం జనుట విధిలేని శీలము.

స్పర్ధ సర్వవృత్తులనావేశించే దుర్దమమైయుండు సీమలు ఐరోపాదులు, ఆ దేశముల నదిచెల్లు విధానముల వెల్లడింతము.

స్పర్ధయొక్క నిర్చనము

స్పర్ధయననేమి! వైతనికులు యజమానులును కూటములుగా గూడక స్వస్వప్రయోజన తృష్ణచే దమలోదామును, ఒండొరులతోను శాసనాచారాదులచే నాపబడక నిరర్గళము మత్సరించుట. అప్రమేయము ననర్గళంబునైన మాత్సర్య మూహామాత్రమేకాని కాలదేశవర్తమానమ లచే బాధితంబై యఖండముగ నెందునుం జూపట్టదు. స్పర్ధకుంగల నిరోధము లెవ్వియన:-

లాభంబొండుమాత్ర ముద్దేశించి బిడ్డపాపలతో బుట్టిపెఱిగిన యూరులవిడిచి కడుదవ్వుబో నెవ్వరికి నైతిగాదు. వాత్సల్యము, ప్రేమ, కృతజ్ఞత, దయా దాక్షిణ్యములును, కామగ మనంబునకుం బ్రతి బంధకములు. ఎట్లన ఎక్కువజీతమ నిచ్చెదనని పిలిచినను, ఈవఱకుం బోషించిన యజమానుల విడిచి సేవకులు పోవుటయు, తక్కువ కూలికి వచ్చువారున్నను చాలనాళ్ళనుండి తామునాశ్రయించి బ్రతుకు సేవకుల నివర్తింప యజమానులును హృదయముల దిట్టముల జేసికొనుటయు, ప్రకృతి విరోధము. ఇంతేకాదు. తలిదండ్రులయెడ భార్యయందు, బంధుమండలినిగల యనురాగము మొదలగు మృదు స్వభావములును స్పర్ధయొక్క తైక్ష్ణ్యము నుపశమింపజేయునవి యైనందుననే సమర్ధతకుం బ్రతికూలములని యెన్నరాదు. ఏలన నార్థిక ప్రయత్నములకు నాధారము తమకునైనవారికి పోషణము ప్రీతి సమకూర్పవలయునను నభిలాషయేకద! స్పర్ధసంపదలం బొదలజేయునదియైనను, ఆ స్పర్ధకు మితత్వముంగల్పించు వాంఛలును కలుముల నగ్గలముగ