పుట:Bhaarata arthashaastramu (1958).pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్షయించి వెలల మఱియు వృద్ధికిందార్చును. ఇట్లు క్రయిక విక్రయికుల మాత్సర్యసారంబునంజేసి వృత్తుల స్థితిగతులు క్రమము ననుసరించి యమిత లాభనష్టములకుం బాత్రంబులుగాక వర్తిల్లును. ఈ విషయము నింకను ముందు బ్రకటింతుము స్పర్థకు సందియ్యని జనములలో వృత్తులం బరిపాలించు న్యాయమెయ్యది యనిన శాసనాచారోపదిష్టములైన నియమములు. దృష్టాంతము మనమే. గ్రామములలో వృత్తులు, వర్ణములు నొక్కటే కాన పోటాపోటీ యగ్గలముగాదు కావున శిల్పులిచ్చ వచ్చిన ధరల విధించినయెడల నితరవర్ణస్థులు ప్రవేశించి వెలల గ్రిందుబఱచుట దుర్ఘటము. మఱియు, చర్మకారునికో, స్వర్ణ కారునికో గిరాకిరాకపోయిన నావృత్తులవిడిచి లాతివృత్తుల ప్రాపునరయ వెఱపు లేమిచే వారికిని నార్తి దుస్సహమవును. ఇట్లు ఒకతఱి సంఘమునకును మఱియొకతఱి శిల్పులకును ప్రాణములు తపించి పోవునగాన, నిఱుతెఱంగులకును హితమగునట్లు అనుభవ నియతంబైన పథ్యంబొకండు ప్రచారమునకువచ్చె. అదియేదన, మామూలు ధరలు, మామూలు బత్యములు. పెండ్లి పేరంటములలో నవసర మెంతహెచ్చినను కుమ్మరి, మంగలి, చాకలి, ఇత్యాదు లెక్కువ యడుగ గూడదనియు, నొకవేళ బురుషులందఱును దీక్షవహించుటచే మంగలి యప్రయోజకుడైనను, తక్కువ యియ్యగూడదనియు గాలక్రమేణ, ఆచారమడరి పోట్లాటకాట్లాటలు లేకుండజేసెను. చూడుడు! స్పర్థలేనిచో సంఘమునకును బ్రజలకును స్వతంత్రత యస్తమితమౌట స్వాభావికము, శాస్త్రములు, ఆచారములు, వాడుకలు ఇత్యాదులకు నొకరైనదప్పక యెల్లరు సర్వవిధమ్ముల విధేయులై యుండినంగాని యస్పర్ధస్థితి నివ్వటిల్లదు. పరతంత్ర ప్రవర్తన సాహసవికాసములకు భంగహేతువనియు, వృద్ధికి దుర్నివారమైన యాటంక మనియు, పున:పున: ప్రమాణించి వున్నాముగాన పారంపర్య సమాగతము లప్రశస్తం లనియు స్వేచ్ఛా విహారములు మాత్సర్యము నవశ్యముగ ననుష్ఠేయము